TIRUPATHI AIRPORT IS TURNING OUT TO BE CARE OF ADDRESS FOR CONTROVERSIES WITH PROTOCOL ISSUES FULL DETAILS HERE PRN TPT
Tirupathi: వివాదాలకు కేంద్రంగా తిరుపతి ఎయిర్ పోర్ట్.. అక్కడ అసలేం జరుగుతోంది..?
తిరుపతి ఎయిర్ పోర్ట్ (ఫైల్)
Tirupathi Airport: రాయలసీమ జిల్లాలో ఏకైక ఆంతర్జాతీయ విమానాశ్రయమైన తిరుపతి ఎయిర్ పోర్ట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘోర అవమానం తప్పడం లేదు.
రాయలసీమ జిల్లాలో ఏకైక ఆంతర్జాతీయ విమానాశ్రయమైన తిరుపతి ఎయిర్ పోర్ట్ (Tirupati Airport) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘోర అవమానం తప్పడం లేదు. చిత్తూరు జిల్లా (Chittoor District) కు రాజకీయ, రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్న వారి తాకిడి అధికంగా ఉంటుంది. వారికి స్వాగతం పలికేందుకు జిల్లాలోని అధికారులు, రాష్ట్ర మంత్రులు, ప్రోటోకాల్ పరిధిలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ లు వస్తుంటారు. ఇలా స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని విమానాశ్రయ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ పోర్టు అధికారులకు, నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.
తిరుపతిలో భారీ స్థాయిలో జరిగిన జాతీయ కబాడీ పోటీల ముగిపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) హాజరయ్యారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రోటోకాల్ ప్రకారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లిన భూమన అభినయ్ రెడ్డిని టెర్మినల్ మేనేజర్ సునీల్ అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టులో ఎలాంటి ప్రొటోకాల్స్ లేవని... మీతో మరో ఇద్దరినీ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. రూల్స్ ను తుంగలో తొక్కుతున్న ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు వివరించేందుకు అభినయ్ రెడ్డి యత్నించినా వినకుండాఎదురు దాడికి దిగే ప్రయత్నం చేసాడు టెర్మినల్ మేనేజర్ సునీల్. దీంతో ఇద్దరిమధ్య తారాస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ నువ్వెంత అంటే నువ్వెంత అనుకొనే స్థాయికి వెళ్లింది.
వాస్తవానికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్ తో కలసి మరో ఇద్దరు తిరుపతికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికేందుకు టెర్మినల్స్ కు వెళ్లొచ్చు. ఎయిర్ పోర్ట్ ఆథారిటీ డైరెక్టర్ సురేష్ ధోరణి వల్ల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటం గమర్హం. దింతో మునిసిపల్ అధికారులు ఎయిర్ పోర్ట్ అథారిటీగా మారింది. నేనెంటో చూపిస్త అని ఒకరు అంటే తిరుపతి దాటి బయట ప్రాంతాలకు ఎలా వెళ్తావోచూస్తానని సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నారు.
గతంలో గవర్నర్, ఆర్థిక మంత్రి, ఆర్డీఓకు ఇదే అవమానం
తిరుపతి ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనలే ఇదే మొదటిసారికాదు. ఏపీ గవర్నర్ గా ఎంపికైన అనంతరం ముందుగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించాలని బిశ్వభూషణ్ హరిచంద్ భావించారు. దీంతో నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడకు వచ్చిన గవర్నకు ప్రోటోకాల్ ఇచ్చేనందుకు అథారిటీ డైరెక్టర్ విముఖత చూపారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.
ఇక రాష్ట్రమంత్రి బుగ్గనకు రాజేంద్ర నాథ్ రెడ్డికి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 2021 జూన్ లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తిరుపతిలో పర్యటించారు. కేంద్రమంత్రికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన సమయంలో రన్ వేకు వెళ్లే రెండో గేట్ దగ్గర మంత్రి బుగ్గనను ఎయిర్ పోర్టు అథారిటీ సెక్యూరిటీ అప్పట్లో అడ్డుకున్నారు. ఆయన తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిని అని చెబుతున్నా వినకకుండా తోసేసినట్టు విశ్వసనీయ సమాచారం. మంత్రి ఎంత చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.. లిస్టులో పేరు ఉన్నవారిని మాత్రమే పంపిస్తామని.. ఆ లిస్టులో బుగ్గన పేరులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డికిఅయితే పలుమార్లు ఇలాంటి అవమానాలు తప్పలేదు. రెవిన్యూ డివిజన్ లో ప్రోటోకాల్ ఆఫీసర్ గా వ్యవహరించే అధికారికి సైతం పరాభవం తప్పలేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.