ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి ఆలయ మూసివేత..

గ్రహణం ఉదయం 11.16గంటలకు ఉండటంతో.. డిసెంబర్ 25వ తేదీ రాత్రి 11గంటలకు ఆలయ తలుపులు మూయనున్నారు.

news18-telugu
Updated: November 24, 2019, 10:40 PM IST
ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి ఆలయ మూసివేత..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డిసెంబర్ 26న సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సూర్యగ్రహణానికి 6 గంటల ముందే ఆలయ తలుపులు మూయనున్నారు. గ్రహణం ఉదయం 11.16గంటలకు ఉండటంతో.. డిసెంబర్ 25వ తేదీ రాత్రి 11గంటలకు ఆలయ తలుపులు మూయనున్నారు.తిరిగి డిసెంబర్ 26న గురువారం మధ్యాహ్నం 12గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయశుద్ది అనంతరం మధ్యాహ్నం 2గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.శ్రీవారి భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలని ఒక ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠం కాంప్లెంక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు 22గంటల సమయం పడుతోంది.

First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>