తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ‘తీపి’ కబురు....

తిరుమల లడ్డు

శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయిస్తోంది.

 • Share this:
  కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల 50 రోజులకు పైగా శ్రీవారి దర్శనం కరువైన తిరుమల వెంకన్న భక్తలకు టీటీడీ తీపికబురు అందించింది. నేటి నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయిస్తోంది. గతంలో లాగా ఎలాంటి షరతులు లేకుండా భక్తులు కోరినన్ని లడ్డూలు, వడ ప్రసాదాలను టీటీడీ సిబ్బంది అందజేస్తున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తుల్లో సంతోషంగా ఉన్నారు.

  Ttd, ttd laddu, Tirumala, yv subba reddy, టీటీడీ, లడ్డూలు, తిరుమల, వైవీ సుబ్బారెడ్డి
  లడ్డూ ప్రసాదం


  మరోవైపు లాక్‌డౌన్ తరువాత పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే యోచనలో ఉన్న టీటీడీ... ఆ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ముందుగా ప్రయోగాత్మకంగా కొందరిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతిరోజు 14 గంటలపాటు భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు ఐదు వందల మందికి మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ... ఆ తరువాత 15 రోజుల పాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని భావిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో రోజుకు 7 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్న టీటీడీ... టికెట్లు పొందిన భక్తులనే తిరుమలకు అనుమతించాలని యోచిస్తోంది. ఈ మేరకు అలిపిరి దగ్గర ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: