తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఏప్రిల్ 5, 6 తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండావిస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి తాగునీటి కొళాయిలు, మార్గమధ్యంలో రోప్‌లుఏర్పాటుచేయాలన్నారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులుఏర్పాటుచేయాలన్నారు. ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె సమస్యలు, స్థూలకాయం ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఈ ఆఫర్ మీకోసమే..
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళకుండా రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేలా సిబ్బందినిఏర్పాటుచేయాలన్నారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో.. పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఏఎస్పీ మునిరామయ్య, డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్ రావు, డిఎఫ్ఓ శ్రీనివాస్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala, Tirupati, Ttd