తిరుమల వెంకన్నకు ఏటేటా పెరుగుతున్న కానుకలు.. ఈ ఏడాదిలోనే ఏకంగా..

TTD : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏటేటా కానుకలు, హుండీ ఆదాయం పెరుగుతోంది. భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి, ఇతర విరాళాలు ఏటా పెరుగుతున్నాయి. టీటీడీ అభివృద్ధి కోసం దాతలు సమర్పించే విరాళాలు కూడా రికార్డు స్థాయిలో ఉంటున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 11, 2019, 5:40 PM IST
తిరుమల వెంకన్నకు ఏటేటా పెరుగుతున్న కానుకలు.. ఈ ఏడాదిలోనే ఏకంగా..
తిరుమల శ్రీవారి ఆలయం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 11, 2019, 5:40 PM IST
ఏడు కొండల వాడు.. వేంకట రమణుడు.. గోవిందా అంటే కష్టాలు తీర్చే కరుణామయుడు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏటేటా కానుకలు, హుండీ ఆదాయం పెరుగుతోంది. భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి, ఇతర విరాళాలు ఏటా పెరుగుతున్నాయి. టీటీడీ అభివృద్ధి కోసం దాతలు సమర్పించే విరాళాలు కూడా రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. మరోవైపు, స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతోంది. ఒక్క ఈ ఏడాదే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో శ్రీవారికి రెట్టింపు స్థాయిలో కానుకలు వచ్చాయి.
lord venkateswar dollors for sale on akshaya tritiya occasion, akshaya Tritiya, srivari dollors sale, srivari dollor, lord venkateswara dollor, lord venkateswara dollor sales, srivari dollors sale on akshaya tritiya, akshaya tritiya,akshaya tritiya 2019,akshaya tritiya importance,akshaya tritiya pooja,akshaya tritiya 2019 date,akshaya tritiya puja vidhi,kab hai akshaya tritiya 2019,akshaya tritiya shubh muhurt puja vidhi,akshaya tritiya puja,akshay tritiya,akshaya tritiya puja at home,akshaya tritiya 2019 date time,akshaya tritiya festival 2019 in india,2019 akshaya tritiya,akshaya tritiya in tamil, ttd,svbc ttd,svbc ttd live,ttd youtube channel,nav ttd,ttd nav,ttdgg,ttd music,ttd new song,ttd devotees,svbc ttd songs,ttd thirumala,ttd trademark,ttd total seva,ttd seva timings,ttd seva tickets,ex ttd head priest,ttd dokkan battle,ttd accommodation,svbc ttd programes,ttd nitya annadanam,ttd telugu mp3 songs,ttd on new boondi potu,ttd annadanam scheme,ttd pradhana archakulu,ttd online room booking, Akshaya Tritiya 2019, akshaya tritiya 2019 gold, akshaya tritiya 2019 gold offers, gold offers in hyderabad, gold offers 2019, gold offers today in hyderabad, gold shops offers in hyderabad, gold making charges, gold rate, gold price, అక్షయ తృతీయ 2019, అక్షయ తృతీయ ఆఫర్స్, బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారం రేట్, బంగారం ధర, హైదరాబాద్ బంగారం ఆఫర్, హైదరాబాద్ నగలపై ఆఫర్, నగలు మోసాలు, ఆభరణాల మోసాలు, మజూరీ అంటే, తరుగు అంటే, అక్షయ తృతీయ, శ్రీవారి డాలర్లు, టీటీడీ, తితిదే, తిరుమల తిరుపతి దేవస్థానం, అక్షయ తృతీయ సందర్భంగా, అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారి డాలర్ల అమ్మకం..
తిరుమలేశుని హుండీల్లో భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటా పెరుగుతున్నాయి. నిత్యం తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలు.. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఏకాంతసేవ వరకు నాన్ స్టాప్‌గా భక్తులతో శ్రీవారి ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. వాళ్లు హుండీలో వేసే కానుకలు రద్దీని బట్టి రోజూ 10 నుంచి 12 హుండీలు నిండిపోతున్నాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న టీటీడీ అధికారులు
2003-04లో హుండీ ద్వారా రూ.227 కోట్ల ఆదాయం రాగా.. 2018-19 నాటికి రూ.1,231 కోట్లకు చేరుకుంది. ఒక్క ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో రూ. 497.29 కోట్లు కానుకలు వచ్చాయి. గత ఏడాది ఇదే ఐదు నెలల్లో రూ.450.54 కోట్లు వచ్చాయి. ఇక, 525 కిలోల బంగారం దక్కింది. కిందటేడాది ఇదే 5 నెలల్లో 344 కేజీల బంగారం లభించింది.





గత ఏడాది శ్రీవారి హుండీకి 1,128 కిలోల వెండి కానుకలు లభించగా, ఈ సారి ఏకంగా 3,098 కిలోల వెండి భక్తుల ద్వారా వచ్చింది. టీటీడీ నిర్వహిస్తున్న 10 ట్రస్టులు, మరో పథకానికి గత ఏడాది రూ.114 కోట్ల విరాళాలు అందగా, ఈ ఏడాది రూ.141 కోట్ల విరాళాలు వచ్చాయి.
Loading...


టీటీడీ లెక్కల ప్రకారం.. భక్తుల సంఖ్య పెరిగింది ఇలా.. (సగటున)
1952 నాటికి రోజుకు రెండువేలు
1974 నాటికి రోజుకు 8 వేలు
1980 తర్వాత 15 వేలు
1990 నాటికి 25 వేలు
200‌‌‌‌0 నాటికి 40 వేలు
2010 నాటికి రోజుకు 60 వేలకు చేరుకుంది.
2010 ఏడాది మొత్తం వెంకన్నను దర్శించుకున్న వారి సంఖ్య 2.14 కోట్లు
2011లో 2.43 కోట్లు
2012 లో 2.73 కోట్లు
2013 లో 1.96 కోట్లు (సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫెక్ట్)
2014 లో 2.26 కోట్లు
2015 లో 2.42 కోట్లు
2016 లో 2.51 కోట్లు
2017 లో 2.62 కోట్లు
2018 లో 2.74 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.9 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...