TTD: భక్తులకు టీటీడీ సూచనలు.. తిరుపతికి రావాలంటే ఇక నుంచి ఇవి తప్పనిసరి.. కండీషన్స్​ ఏంటంటే

ప్రతీకాత్మక చిత్రం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కొన్ని సూచనలు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు (Tickets) ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమల (Tirumala)కు అనుమతిని ఇస్తున్నామని అధికారులు చెప్పారు.

  • Share this:
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కొన్ని సూచనలు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు (Tickets) ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమల (Tirumala)కు అనుమతిని ఇస్తున్నామని అధికారులు చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ (Vaccination Certificate) కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ (RTPCR Negative certificate) కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజ్ఞ‌ప్తి చేసింది. ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌టంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ (Checking) చేసి వెన‌క్కు పంపుతున్నారు. అందుకే భ‌క్తులు (devotes) ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరింది. టికెట్లు లేకుండా ఆనేకమంది భక్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తుండ‌టంతో దేవస్థానం ఈ ప్రకటన చేసింది.

ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు..

తిరుమ‌ల (Tirumala) శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు కోవిడ్ నిబంధనలను అనుసరించి అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జరగనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంట‌ల‌కు ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు.

బ్రహ్మోత్సవాల విశేషాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

06.10.2021 - బుధ‌వారం - అంకురార్ప‌ణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు..

07.10.2021 - గురువారం - ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) - సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వ‌ర‌కు.

08.10.2021 - శుక్ర‌వారం - చిన్న‌శేష వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10వ‌ర‌కు.. హంస వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

09.10.2021 - శ‌నివారం - సింహ వాహ‌నం -ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3గంటల వ‌ర‌కు.. ముత్యపుపందిరి వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

10.10.2021 - ఆదివారం - క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

11.10.2021 - సోమ‌వారం - మోహినీ అవ‌తారం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. గ‌రుడ‌సేవ‌ - రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు..

12.10.2021 - మంగ‌ళ‌వారం - హ‌నుమంత వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.. స్వ‌ర్ణ‌ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం - సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.. గ‌జ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

13.10.2021 - బుధ‌వారం - సూర్య‌ప్ర‌భ వాహ‌నం - ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు... స్న‌ప‌న తిరుమంజ‌నం - మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.. చంద్ర‌ప్ర‌భ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

14.10.2021 - గురువారం - ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7.35 గంట‌ల‌కు... అశ్వ వాహ‌నం - రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు..

15.10.2021 - శుక్ర‌వారం - ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం - ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం - ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).. ధ్వ‌జావ‌రోహ‌ణం - రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు..
Published by:Prabhakar Vaddi
First published: