TIRUMALA TIRUPATI NEWS THEY BUILD AT LORD VENKATESWARA SWAMY TEMPLE IN VISAKHAPATNAM NGS VSP
TTD Temple: సాగర తీరంలో ఇకపై వెంకన్న దర్శనం.. ప్రత్యేకతలు ఇవే
సాగరతీరంలో వెంకన్న దర్శనం
TTD Temple: విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం విశాఖలోనే కలగనుంది. వారం రోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని టీటీడీనిర్ణయించింది.
P Anand Mohan, Visakhapatnam, News18. TTD News: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు.. ప్రపంచ నలు మూలల నుంచి తిరుమల వచ్చి మరీ ఆయన దర్శనం చేసుకుంటారు. అందుకోసం ఎంత కష్టానికైనా ఓర్చుకుంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకం ప్రజలకు.. అయితే ఇకపై విశాఖతో పాటు, ఉత్తరాంధ్ర వాసులకు వెంకన్న స్వామి దర్శనం భాగ్యం ఇక్కడే కల్పించే ఏర్పాట్లు చేసింది. సాగరతీరంలో ఇకపై వెంకన్న దర్శనం కల్పించనుంది. మార్చి 18 నుండి 23వ తేదీ వరకు ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ చేతులు మీదుగా జరగనుంది.
విశాఖ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆలయ ప్రారంభానికి టీటీడీ ముహూర్తం పెట్టింది. విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 23వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
మార్చి 18వ తేదీ శుక్రవారం రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. మార్చి 19న శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమం నిర్వహిస్తారు.
మార్చి 20న ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు చేపడతారు. మార్చి 21న సోమవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హోమం, జలాధివాసం, యాగశాల కార్యక్రమాలు, రత్నన్యాసం, విమాన కలశస్థాపన, బింబస్థాపన, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.