హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

subramanian swamy on TTD: టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే అది జరుగుతుందని వ్యాఖ్య

subramanian swamy on TTD: టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే అది జరుగుతుందని వ్యాఖ్య

ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో  కరోనా కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు చర్యలు మొదలు పెట్టారు. కోవిడ్ ఉధృతితో ఏపీలో ఆల‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌న్నారు దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్. ద‌ర్శ‌నాలు, అన్న‌దానం వ‌ద్ద భ‌క్తుల సంఖ్య‌ను తగ్గిస్తున్నామ‌ని చెప్పారు.

ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు చర్యలు మొదలు పెట్టారు. కోవిడ్ ఉధృతితో ఏపీలో ఆల‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌న్నారు దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్. ద‌ర్శ‌నాలు, అన్న‌దానం వ‌ద్ద భ‌క్తుల సంఖ్య‌ను తగ్గిస్తున్నామ‌ని చెప్పారు.

subramanian swamy on Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.. టీటీడీకి సంబంధించి పరువు నష్టం దావా కేసుకు సంబంధించి తిరుపతి వచ్చిన ఆయన.. కీలక కామెంట్లు చేశారు.

ఇంకా చదవండి ...

Subramanian swamy Comments on Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానంపై  బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి (Subramanian swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు.  తిరుపతి  (Tirupati) కోర్టుకు హాజరైన అయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ (TTD) తరుఫున వాదించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీటీడీ అభ్యర్ధన మేరకు వంద కోట్ల రూపాయల పరువునష్టం కేసు ఫైల్ చేశామని చెప్పారు. తన తరపున టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ సత్య సబర్వాల్ కేసు వాదిస్తారన్నారు. అయితే ఈ కేసు ఫైల్ అయ్యి దాదాపు 90 రోజులు దాటిందని.. అయితే ఆ దినపత్రిక నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదన్నారు. దీంతో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆ పత్రిక‌ను ఆదేశించిందని సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి అవసరం అని అభిప్రాయపడ్డారు. దానికోసం తాను చాలాకాలంగా పోరాటం చేస్తున్నానన్నారు.

హిందువులు, భక్తులు అంతా ఆశించినట్టే టీటీడీ కాగ్ పరిధిలోకి రానుంది అభిప్రాయపడ్డారు. కచ్చితంగా వచ్చే ఏడాది నుంచి టీటీడీ ఆడిట్ కాగ్ పరిధిలోకి వెళుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది తన అభిమతం అన్నారు. దీనిపై టీటీడీ గతంలోనూ తీర్మానం చేసింది. దేవస్థానంలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఆడిట్‌ బాధ్యతలను కాగ్‌ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ధర్మకర్తల మండలి నిర్ణయించింది. చాలా కాలంగా భక్తులు, దాతలు ఇదే కోరుకుంటున్నారని టీటీడీ అప్పుడు అభిప్రాయపడింది.

ఇదీ చదవండి : పండుగముందు వలకు చిక్కిన భారీ పండుగప్ప.. మత్య్సకారుల పంట పండింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు

అందరి కోరికా త్వరలోనే నెరవేరుతోంది అన్న బీజేపీ ఎంపీ.. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా ముందుంటాను అన్నారు.  దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదు అన్నారు. అలాగే పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకిలు బ్రాహ్మణులు కాకపోయినా ప్రచారం చేసి బుషులుగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారన్నారు.

ఇదీ చదవండి : నమ్మి అప్పు ఇప్పించారు.. చివరికి ఇలా చేశారు

భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని.. తాను హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నాను అన్నారు. అయితే అనువంశిక అర్చకత్వంకు మాత్రం తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. రోజు తనకు వేల సంఖ్యలో ట్విట్ లు వస్తుంటాయని.. రమణ దీక్షితులు చేసిన ట్వీట్ లు తాను గమనించలేదన్నారు.

ఇదీ చదవండి : ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్.. నైట్ కర్ఫ్యూ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఇవే

దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించని.. తాను న్యాయ పోరాటం చేస్తామన్నారు. తమిళనాడు రాజకీయాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కరుణానిధి అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని.. అయితే స్టాలిన్ పాలన తాను సరిగ్గా చూడలేదన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala brahmotsavam 2021, Ttd news

ఉత్తమ కథలు