ఇవాళ చంద్రగ్రహణం... 5 గంటలు మాత్రమే తిరుమల స్వామి దర్శనం

సాయంత్రం 7 గంటలనుంచి ఎల్లుండి ఉదయం 9గంటలవరకు తిరుమల,తిరుపతి లోని అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద కేంద్రాలను కూడా టీటీడీ మూసివుయనుంది.

news18-telugu
Updated: July 16, 2019, 8:53 AM IST
ఇవాళ చంద్రగ్రహణం... 5 గంటలు మాత్రమే తిరుమల స్వామి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి సంబంధించి... 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్‌లతో డిపాజిట్ అయివుంది. టీటీడీ ట్రెజరీలో దాదాపు 1,934 కేజీల బంగారం ఉంది. ఇందులో ఇటీవల మూడేళ్ల డిపాటిజ్ స్కీమ్ ముగిసిపోవడంతో... పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచీ రిటర్న్ తెచ్చుకున్న 1,381 కేజీల బంగారం కూడా ఉంది.
news18-telugu
Updated: July 16, 2019, 8:53 AM IST
ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలన్ని మూతపడనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ...  కేవలం ఐదుగంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ కాసేపు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కలగనుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదుగంటలకే దర్శనం నిలిపివేయనున్నారు టీటీడీ అధికారులు.  ఉదయం తిరుమలలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం ఉన్న నేపధ్యంలో మధ్యాహ్నం 12గంలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది.

సాయంత్రం ఐదుగంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతి నిలిపివేయనున్నారు. సాయంత్రం 7గంటలకు ఆలయమహాద్వార తలుపులు మూసివేయనున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలనుంచి ఎల్లుండి ఉదయం 9గంటలవరకు తిరుమల,తిరుపతి లోని అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద కేంద్రాలను కూడా టీటీడీ మూసివుయనుంది. తిరిగి బుధవారం ఉదయం స్వామివారి ఆలయ తలుపులు తెరవనున్నారు.  సుప్రభాతం నిర్వహించి ఆలయ శుద్దికార్యక్రమాల తర్వాత మిగతా నిత్యసేవలు ప్రారంభంకానున్నాయి.

తిరిగి 17వ తేదీ  తెల్లవారు జామున 5గంటలనుంచి క్యూలైన్లలోకి భక్తులు అనుమతి ఇవ్వనున్నారు. 11 గంటలనుంచి క్యూలైన్ల నుంచి స్వామివారి దర్శనంకు పంపనున్నారు. గ్రహణం సందర్భంగా రేపు అన్ని రకాల ప్రత్యేక ,వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...