Tirumala Tirupati Jobs | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్ధని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆదే ప్రాంతానికి చెందిన కిరణ్ నాయుడు తనకు పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తారని మాయమాటలు చెప్పాడు. తనకు రూ.20 వేలు కమిషన్ ఇవ్వవలసి ఉంటుందని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇతను ఇంతకు ముందు కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేయడంతో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నందు Cr.No. 220/2020, U/S 420 R/W 511 IPC ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదేవిధంగా టీటీడీ నందు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్బంలు ఉన్నాయి. అటువంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్ ) ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం పూర్తిగా అసాధ్యం. ఇటువంటి విషయలపై టీటీడీ గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి దళారుల మాటలు విని, మోసపోకుండా ఉండాలని టీటీడీ కోరింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 27, 2020, 22:14 IST