• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • TIRUMALA TIRUPATI DEVASTHANAM TOOK DECISION TO NOT ADAPT SMALL TEMPLES LOCATED IN REMOTE AREAS BECAUSE OF FINANCIAL BURDEN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

TTD Temples: వెంకన్నపై ఆర్ధిక భారం తగ్గించేందుకు టీటీడీ వ్యూహం... భక్తుల స్పందన ఎలా ఉంటుందో..!

TTD Temples: వెంకన్నపై ఆర్ధిక భారం తగ్గించేందుకు టీటీడీ వ్యూహం... భక్తుల స్పందన ఎలా ఉంటుందో..!

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

చిన్నచిన్న ఆలయాలు మారమూల ప్రాంతల్లో ఉండటమే కాకుండా.. దేవుడి మాన్యాలు కోర్టు కేసుల్లో ఉండటం టీటీడీకి (TTD) భారంగా మారుతోంది.

 • Share this:
  కరోనా వైరస్ సామాన్య ప్రజలే కాదు పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు కూడా కుదేలు అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతం ఏడాది భారత్ పై కోవిడ్-19 పంజా విసరడంతో.., లాక్ డౌన్ అనివార్యంగా మారింది. దీంతో అన్ని ఆలయాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కన్నా రెండు రోజుల ముందే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి 83 రోజుల పాటు భక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తులకు శ్రీవారి దర్శనం దూరమైంది. గతేడాది జూన్ మాసంలో తిరిగి శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించినా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ వస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1200 కోట్ల రూపాయల హుండీ ఆదాయాన్ని అంచనా వేసింది ఆర్థిక విభాగం. లాక్ డౌన్ తో అంచనాలు అంత తారుమారు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 721 కోట్ల రూపాయలు మాత్రమే శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం లభించింది.

  దీంతో గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను కుదిస్తూ 2,553 కోట్లకు పరిమితం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాను 2,937.55 కోట్లకు అంచనా వేసింది టీటీడీ. నిత్యం శ్రీవారి హుండీ ద్వారా లభించే ఆదాయం.. లడ్డు విక్రయాలు గతంలో పోల్చితే తగ్గుముఖం పట్టింది. అలాగే పాటుగా ఆర్జిత సేవలు ఏకాంతం చేయడంతో టీటీడీకి ఆదాయం మరింత తగ్గింది. అయితే ఆలయాల పరిరక్ష కోసం టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు నిధులు సమకూర్చడమే కాకుండా....శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ సంకల్పించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గతంలో ఐదు వందల నుంచి ఏడు వందల వరకు శ్రీవారి టిక్కెట్లను కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. ప్రస్తుతం కరోనా కారణంగా కేవలం 200 టిక్కెట్లను మాత్రమే రోజువారీగా జారీ చేస్తూ వస్తోంది. దీంతో ఫిబ్రవరి మాసంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఖర్చును తగ్గించే మార్గం ఎంచుకుంది.

  ప్రస్తుతం టీటీడీ పరిధిలో 32 ఆలయాలు ఉన్నాయి. వాటి పూర్తి బాధ్యత టీటీడీనే చూసుకుంటుంది. ఈ ఆలయాల్లో టీటీడీ ఉద్యోగిని నియమించి...మరి కొందరి అవుట్ సౌర్సింగ్ ఉద్యోగులను నియమించాల్సి వస్తోంది. తద్వారా ఆలయాలకు వచ్చించే ఖర్చు మరింత పెరుగుతోంది. ఆలయాలను టీటీడీ పరిధిలో తీసుకుంటే మరింత భారం పెరిగే అవకాశం ఉండటంతో నూతనంగా ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోరాదని తీర్మానించింది. తమ ప్రాంతాల్లో కూడా ఆలయాలను పర్యవేక్షించాలని భారీగా విన్నతులు అందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుట్లు సమాచారం.

  టీటీడీ పరిధిలోకి ఆలయాలను తీసుకోరాదని ఇప్పుడే కొత్తగా ప్రతిపాదించింది కాదు. గతంలోనూ అనేకసార్లు టీటీడీ పాలకమండలిలో సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. మొదటి సారిగా 1997లో ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోరాదని అప్పటి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 2005లో మరోసారి పాలకమండలి ఇదే అంశంపై తీర్మానం చేసారు. ఇక 2012లోను ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. దీనిపై ఇంజినీరింగ్, అకౌంట్స్, ఎస్టేట్, న్యాయ, సర్వీసు విభాగాల అధికారులు పరిశీలించి...వారు ఇచ్చే నివేదిక ఆధారంగా పర్యవేక్షణపై తుది నిర్ణయానికి రావాలని అప్పటి పాలకమండలి అభిప్రాయపడింది.

  టీటీడీకి ఎదురవుతున్న ఇబ్బందులేంటి..?
  ప్రస్తుతం టీటీడీ పరిధిలో తీసుకోవాలని విన్నతులు వస్తున్న ఆలయాలు మారుమూల ప్రాంతంలో ఉండటం.., వాటి ఆదాయం మార్గాలు నామమాత్రంగా ఉండటంతో టీటీడీకి మరింత భారంగా మారుతున్నాయి. ఇక ఆ ఆలయాలకు సంబంధించిన భూములు., ఇతర ఆస్తులు వివాదాల్లో చిక్కుకోవడం.., వాటిని విడిపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ఇక ఆలయాలను పర్యవేక్షిస్తున్న సిబ్బందికి టీటీడీ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. పర్యవేక్షణకు తీసుకున్న ఆలయాల్లో.. అంతకుముందు పండగలు, ఇతర కార్యక్రమాలకు నామమా త్రంగానే నిధులు వెచ్చించేవారు. ఇప్పుడు భారీగా ఖర్చు చేసి భారాన్ని తితిదే పై మోపుతున్నారు. ఆయా ఆలయాల పరిధిలోని భూవివాదాలు, ఇతర సమస్యలపై న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కొన్ని ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.
  Published by:Purna Chandra
  First published:

  అగ్ర కథనాలు