TTD: శ్రీవారి ఆలయంలో కీలక మార్పులు... మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైన టీటీడీ..?

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

తిరుపతి ఆలయంలో (Tirumala Templs) కీలక మార్పులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanam) పాలక మండలి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కమిటీని నియమించింది.

  • Share this:
    తిరుమల.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీవారి ఆలయం విషయంలో పాలకమండలి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న టీటీడీ సంచలన నిర్ణయం తీసుకొనే విధంగా అడుగులు వేస్తోందా..? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. శ్రీవారి ఆలయ శోభను భక్తులకు అందించే విధంగా ఆలయంలోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించేందుకు పాలకమండలి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుని నిత్య ఆరాధనలు., ఆలయంలోని నిర్మాణాలు ఇతర కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం చేపడుతారు ఆగమ పండితులు. ఆలయంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న ముందుగా ఆగమ సలహా తీసుకుంటుంది టీటీడీ. శ్రీవారి ఆలయ శోభా భక్తులకు అందించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి ఆలయానికి కాలానుగుణం భక్తుల రద్దీతో పాటుగా తలెత్తిన అవసరాలకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో పలు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు.

    ఆలయానికి ఈశాన్య ములలో ఉన్న రంగనాయకుల మండపంలోను....ఆర్జిత సేవలకు ప్రసాదాలు అందించే వగపడి మండపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వివిఐపిలకు వేదాశీర్వచనంతో పాటు..శ్రీవారి ప్రసాదాలు., జ్ఞాపికలు చాల ఏళ్ళ నుంచి అందిస్తూ వస్తుంది టీటీడీ. ఈ మండపంలో విజిలెన్స్ సిబ్బంది సీసీ కెమెరాల పర్యవేక్షణ కొరకు ఒక గది., విద్యుత్., ఫారెస్ట్ సిబ్బంది అవసరాల కోసం మరో మూడు గదులు నిర్మించారు. నిర్మించిన గదులన్నీ మండపంలోని రాతి స్తంభాలను అనుసంధానం చేస్తూ...తాత్కాలిక గోడలతో నిర్మాణం చేపట్టారు. అలాగే మండపం పూర్తిగా రావి కంచె ఉండేది. ఆర్జిత సేవలు., విఐపి బ్రేక్ మినహా సర్వదర్శనం వెళ్లే భక్తులు రంగనాయకుల మండపం వెనుక భాగం నుంచి శ్రీవారిని దర్శించుకొని వారు. ఆలా దర్శనానికి వెళ్లే భక్తులకు రంగనాయక మండపం శోభ...శీలసంపద కనిపించేది కాదు. ఆలయంలో పశ్చిమ దిశగా ఉన్న కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు కూడా మండపం పూర్తిగా కనపడదు. భక్తులు ప్రసాదం స్వీకరించే ప్రదేశంలో ఉన్న వగపడి భవనం వాళ్ళ ఆ ప్రాంతంలోని ఆలయ శిల్ప సౌందర్యం కనిపించదు.



    అయితే ఆలయ శోభకు తాత్కాలిక కట్టడాలు అడ్డుకాగా ఆలయానికి వచ్చే భక్తులకు మండపాలు...వాటి శిలా సౌదర్య కళాకృతులు వెరసి ఆలయ వైభవం భక్తులకి కనిపించడం లేదని మాజీ టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గుర్తించారు. రంగనాయకుల మండపమీకి చుట్టూ ఉన్న రావి కంచెను తొగించారు. అప్పటి నుంచి ఆలయంలో ప్రవేశించే భక్తులకు రంగనాయకుల మండపంతో పాటుగా ధ్వజస్థంభం కనిపించేలా చేసారు. దింతో ఆలయంలోని మరికొన్ని తాత్కాలిక కట్టడాలు తొలగించాలనే ప్రతిపాదన టీటీడీ పాలకమండలి ముందుకు వచ్చింది. గతేడాది ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చిన...కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

    ఇది చదవండి: రాయలసీమ ముద్దుబిడ్డ vs భరతమాత ముద్దుబిడ్డ… వైసీపీ -బీజేపీల మధ్య చిచ్చుపెట్టిన మంగ్లీ పాట…



    ఆలయంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా తొలగించాలన్న టీటీడీ ముందుగా ఆగమ సలహా మండలి సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలకమండలి ప్రతిపాదన ముందుగా ఆగమ సలహా కమిటీకి సిపార్సు చేసింది. ఆగమ సలహా మండలి సమావేశమై.., తాత్కాలిగా భవనాల తొలగింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. తాత్కాలిక కట్టడాలు తొగలించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆగమ సలహా మండలి స్పష్టం చెసింది. ఆలయం నిర్మాణానికి ఎలాంటి భంగం కలుగకుండా.., రాతి స్థంబాల మధ్య కట్టిన ఇటుక గోడలు తొలగింపుకు పచ్చ జెండా ఊపింది. అవేమి ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టిన కట్టడాలు కావని తీర్మానించింది. ఈ ప్రతిపాదనను టీటీడీ వర్క్స్ కమిటీ పరిశీలనకు పంపింది. వర్క్స్ కమిటీ కూడా పూర్తి అధ్యయనం చేసి.., గతేడాది ఆగస్టులో తాత్కాలిక కట్టడాల తొలగింపుకు సిఫార్సు చేసింది.

    Tirumala Tirupathi Devasthanam, Kalyanamasthu Program, TTD, India, 2021, TTD News, Tirumala News, Tirumala Temple, Tirupathi, TTD news, Sri Venkateswara Swamy, Lord Venkateswara, Andhra Pradesh, Andhra Pradesh news, Ap news, AndhraPradesh, Telugu news, TTD board, తిరుమల తిరుపతి దేవస్థానం, కల్యాణమస్తు, టీటీడీ న్యూస్, తిరుమల న్యూస్, తిరుమల ఆలయం, తిరుపతి, టీటీడీ పాలకమండలి, శ్రీ వెంకటేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయం, తిరుమల దేవస్థానం, ఆంథ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, తిరుమల న్యూస్,

    గత ఏడాది లాక్ డౌన్ అనంతరం వగపడిని కూడా ఆలయం వెలుపలకు తరలించారు. కానీ భవన నిర్మాణం మాత్రం ఆలయంలోపలే ఉండటం.., ఆర్జిత సేవ ప్రసాదాలు కూడా బయట ఇస్తూ వస్తుండటంతో వగపడి ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. మరో మరు దీనిపై అన్నివిధాలా చర్చించిన పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బరెడ్డి ఓ కమిటీని నియమించారు. కమిటీ కన్వీనర్ గా అదనపు ఈఓ., సభ్యులుగా రామేశ్వర్ రావు., రమేష్ శెట్టితో కమిటీ ఏర్పాటు అయింది. ఐఐటి నిపుణుల సలహా మేరకు ఆలయ నిర్మాణం దెబ్బ తినకుండా.., తాత్కాలిక కట్టడాలు తొలగించేందుకు పరిశీలించిన అంశాలతో నివేదిక బోర్డు కు సమర్పించాలని కోరింది.

    దీనికోసం కమిటీకి 15రోజుల గడువు ఇవ్వగా.., ఆ తర్వాత రామేశ్వర్ రావు., రమేష్ శెట్టి ఆలయాన్ని సందర్శించలేదు. వారితో పాటుగా ఐఐటి నిపుణులు పరిశీలనకు రావాల్సి ఉంది. త్వరిత గతిన కమిటీ పరిశీలన పూర్తి అయితే తాత్కాలిక కట్టడాలు తొలగి.., ఆలయ శోభా మరింత భక్తులకు కనువిందు చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
    Published by:Purna Chandra
    First published: