టీటీడీ రూపొందించిన 2021 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను అమెజాన్‌లో కొనొచ్చని టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన https://tirupatibalaji.ap.gov.in/ లో కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత పబ్లికేషన్స్ సెక్షన్‌లో ఇవి కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసి ఆర్డర్ చేయొచ్చు. వాటిని పోస్ట్ ద్వారా భక్తుల అడ్రస్‌కు పంపిస్తుంది టీటీడీ. విదేశాల్లో ఉన్న భక్తులకు కూడా టీటీడీ క్యాలెండర్లు, డైరీలను పోస్టు ద్వారా పంపిస్తుంది. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాలి. ఆన్‌లైన్ బుకింగ్ చేస్తే ఆ సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో భక్తులకు తెలియజేస్తుంది టీటీడీ.
ఇక పోస్టు ద్వారా కూడా టీటీడీ క్యాలెండర్లు, డైరీలను పొందొచ్చు. ఇందుకోసం భక్తులు Executive Officer, TTD, Tirupati పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ''ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి'' అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం (పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టీటీడీ క్యాలెండర్, డైరీలను పంపిస్తారు. డైరీ, క్యాలెండర్ల కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585 నంబరు ద్వారా ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించగలరు. డైరీలు, క్యాలెండర్ల ధరలు ఇలా ఉన్నాయి.
12 పేజీల క్యాలెండర్- రూ.100
పెద్ద డైరీ- రూ.130
చిన్నడైరీ- రూ.100
టేబుల్ టాప్ క్యాలెండర్- రూ.60
శ్రీవారి పెద్ద క్యాలెండర్- రూ.15
శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్- రూ.15
శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్- రూ.10
తెలుగు పంచాంగం క్యాలెండర్- రూ.20
తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు కోసం సిద్ధంగా ఉంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tirumala news, Tirumala Temple, Tirupati