హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD: తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర..? ఎందుకు అంత డిమాండ్..?

TTD: తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర..? ఎందుకు అంత డిమాండ్..?

శ్రీవారి ఆలయం (ఫైల్)

శ్రీవారి ఆలయం (ఫైల్)

Tirumala Tirupati Devasthanam: సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం. ఆ డిమాండ్ కి తగ్గట్టే ఉదయాస్తమాను సేవ టికెట్ల ధరల కోటిన్నర రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18.. Tirumala Tirupati Devasthanam: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ (TTD) నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున 1.5 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) దగ్గర 531  ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందుతారు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు 600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించింది.

  సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే సేవ ఎంత ఖరీదైనా భక్తులు వెనుకాడరు. టికెట్ల ధరలు ఎంతైనా భారీగా డిమాండ్ ఉంటుంది.. అసలు ఉదయాస్తమాన సేవలు అంటే ఏంటి.. ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎందుకంత డిమాండ్. పురాణ పురుషోత్తముడైన వేంకటేశ్వర స్వామి వారికి తిరుమల లో ఉదయము నుండి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన

  సేవ అంటారు.

  ఆర్జిత సేవలు ఇవే..

  1. సుప్రభాత సేవ

  2. తోమాల సేవ

  3. కొలువు

  4. అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)

  5. అభిషేకం

  6. వస్త్రాలంకార సేవ

  7. కల్యాణోత్సవం

  8. రథోత్సవం

  9. తిరుప్పావడ

  10. సహస్ర దీపాలంకరణ సేవ

  11. ఏకాంత సేవ

  సేవలు ఎలా చేస్తారు.. ప్రత్యేకతలు ఏంటి..?

  1. సుప్రభాత సేవ

  తర తరాలుగా హైందవ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీ వేంకటేశ్వరస్తవం ఈ సుప్రభాతం. ఇరువది తొమ్మిది శ్లోకాలు గల సుప్రభాతాన్ని, పదకొండు శ్లోకాలున్న స్తోత్రాన్ని, పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ని,  పదునాలుగు శ్లోకాలున్న మంగళ శాసనాన్ని 15వ శతాబ్దములో  మహాముని శిశ్యులైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు. ఈ దివ్య గానం ఎక్కడ విన్న మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది. శ్రీ వారి సుప్రభాతం అనే ఈ మేలు కొలుపు సేవలో పాల్గొంటే మన మనస్సు మేల్కొని శ్రీ వారి సేవ కు అంకితమవుతుంది.

  2. తోమాల సేవ

  పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళ మూర్తి కి అనేక పుష్ప మాలికలతో, తులసి మాలలతో చేసే అలంకారమే తోమాల సేవ. ఈ సేవ లో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీ వారి పదాల చెంత చేరి జన్మ ధన్య మవుతుంది.

  3. కొలువు

  తిరుమల లో బంగారు వాకిలికి ఆనుకొని వున్న గది ని స్నపన మండపం అంటారు. ఇక్కడే శ్రీ వారికి ప్రతి రోజు ఆస్థానం జరుగు తుంది. సన్నిధి లో వున్న కొలువు- శ్రీనివాస మూర్తి ని ఛత్ర చామరాది మర్యాదలతో, మంగళ వాద్య పురస్సరంగా స్నపన మండపంలో  ఉంచిన బంగారు సింహాసనం పై వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామి కి కొలువు నిర్వహించబడుతుంది. ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణాన్ని స్వామి వారికి విన్న విస్తారు. అలాగే ఆలయ ట్రెజరీ స్వామి వారి యొక్క లావాదేవీలను (ఆదాయ వ్యయాలను) స్వామి వారికి విన్న విస్తారు. ఈ సేవ ను చూసి తరించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి స్వామి వారి అనుగ్రహం కలుగు తుంది.

  4. అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)

  తిరుమల క్షేత్రం లో ప్రతి నిత్యం వెయ్యి నూట ఒక్కటి (1008) సువర్ణ పుష్పాలతో, సహస్ర నామాలతో స్వర్ణాలంకార భూషితుడయిన శ్రీ

  వారికి ఈ అర్చన సేవ జరుగు తుంది. శ్రీ వారి అర్చనలో భక్తులు మనస్సు ఏకాగ్రతను పొంది, శ్రీ వారి పాదాల మీద కేంద్రీకరింపబడి,

  ఆధ్యాత్మిక ఆనందం మరియు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

  5. అభిషేకం

  శ్రీ వారి అభిషేకాన్ని దర్శిస్తే చాలు భక్తులు శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి.

  6. వస్త్రాలంకరణ సేవ

  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసునకు సర్వాంగ సుందరంగా, నయనానంద కరంగా పట్టు వస్త్రాలను

  అలంకరించడమే వస్త్రాలంకరణ సేవ.

  7. కల్యాణోత్సవం

  శ్రీ దేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి (శ్రీ వేంకటేశ్వర స్వామి) వారికి ప్రతి నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది. 15వ

  శతాబ్దములొ తాళ్ళపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభిచబడినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. సర్వ జనులు క్షేమ, స్థైర్య,

  ధైర్యాదులతో ఉండాలంటె, మహా సంకల్పం తో శ్రీ వారికీ కల్యాణోత్సవం చేయటం పరిపాటి. ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీ వారిని కల్యాణ

  చక్రవర్తి అని, తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లు తున్నది.

  8. రథోత్సవం

  రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే | సకల లోకాధిపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి ని రథోత్సవం లో దర్శించు భాగ్యం వలన మరి యొక్క జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రం చెబుతుంది.

  9. తిరుప్పవాడ

  ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చన అనంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవ అంటారు. తిరుప్పావడ సేవ లో

  పాల్గొన్న భక్తులకు నిత్యం అన్నం సమృద్ది గా కలుగుతుంది. పాడి పంటలు వృద్ధి చెందుతాయి.

  10. సహస్ర దీపాలంకరణ సేవ

  ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారు, సర్వాలంకార భూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి

  విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య వున్న ఊయలలో స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా

  ఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయం లో వేద పండితులు వేద మంత్రాలతో స్వామి వారిని కీర్తిస్తారు. నాద స్వర విద్వాంసులు

  సుస్వరంగా నాదస్వరాన్ని విని పిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతో, పురందర దాసు కీర్తనలతో శ్రీ వారికి

  స్వరార్చన చేస్తారు. వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్ప స్వామి మెల్ల మెల్లగా ఉయ్యాల తూగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ

  సేవ లో దేవ దేవున్ని దర్శించిన భక్తునకు సత్సంతానం కలుగుతుంది.

  11. ఏకాంత సేవ

  తిరుమల శ్రీ వారి ఆలయం లో చివరగా జరిగే సేవ ఏకాంత సేవ. ఈ సేవ లో స్వామి వారు బంగారు పట్టె మంచం లో శయన మూర్తి గా

  దర్శన మిస్తారు. శ్రీ వారి పరమ భక్తురాలయిన మాతృ శ్రీ వెంగమాంబ ముత్యాల హారతి ని స్వామి వారికి సమర్పిస్తారు. అన్నమా చార్యుల

  వారి జోల పాట ను పాడి ఆ నాటి సేవలను ముగిస్తారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala brahmotsavam 2021, Tirumala news, Ttd, Ttd news

  ఉత్తమ కథలు