TTD Gift: పెళ్లి చేసుకునేవారికి శుభవార్త.. శ్రీవారి నుంచి కానుక కావాలంటే ఇలా చేయండి..

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

TTD Gift: తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు శుభవార్త చెప్పింది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి శ్రీవారి కానుక ఇవ్వాలి అని నిర్ణయించింది. అయితే ఆ కానుక అందాలి అంటే ఏం చేయాలో తెలుసా..?

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ముఖ్యంగా నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో సాధారణంగా విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. అలాగే చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. కానీ దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖ పంపించలేక.. కరోనా సమయంలో వెళ్లలేక చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారికి మొదటి శుభలేఖ పంపాలి అనుకునే వారికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమలకు వెళ్లకుండానే శుభలేక అందించే అవకాశాన్ని అందించింది. అదెలా అంటే.

    పెళ్లి వేడుక సమయంలో దేవుళ్లను పూజించడం తెలుగువారి సంప్రదాయం. ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యం జరిగిపోవాలని వినాయకుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. శుభలేఖ దగ్గర్నుంచి.. ప్రతి వస్తువును ముందుగా దేవుడి ముందు పెడతారు. ఆ తర్వాతే బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గరలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు. మరి దూరంగా ఉన్నవారి పరిస్థితి ఏంటీ? శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.

    ఇదీ చదవండి: జగన్-షర్మిలలో వైఎస్ ఫ్యామలీ సపోర్ట్ ఎవరికి..? విజయమ్మ ఒకరికి దూరం కావాల్సిందేనా..?

    ఇకపై నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. ఎవరైనా ఇక తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? దానికి ప్రాసెస్ ఏంటి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి? అంటే ఇంట్లో పెళ్లి నిశ్చయం కాగానే మొదటి శుభలేఖను నెల ముందుగానే తిరుమలకు పంపొచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు.

    ఇదీ చదవండి: జగన్–షర్మిల మధ్య పలకరింపులు కూడా లేనంత విబేధాలు..! ఇదే సాక్ష్యం

    ఆ బహుమానం అందుకోవాలి అంటే ‘‘శ్రీ లార్డ్‌ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’’ చిరునామాకు ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయొచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. టీటీడీ కల్పించిన ఈ అవకాశం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: