Home /News /andhra-pradesh /

TIRUMALA TIRUPATI DEVASTHANAM NEW OMICRON EFFECT ON TTD THESE IS THE JANUARY SEVAS NGS TPT

Tirumal: వైకుంఠ ఏకాదశిపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. శ్రీవారి ఆలయంలో జనవరిలో విశేష ఉత్సవాలు ఇవే.. ఏ రోజు ఏంటి..?

తిరుమల తిరుపతి

తిరుమల తిరుపతి

Tirumal Tirupati Devasthanam: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వెకంటేశ్వర స్వామిపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. గత కొన్ని రోజుల నుంచి కరోనా సెకెండ్ వేవ్ కేసులు తగ్గడంతో.. వైకుంఠ ఏకాదాశికి భారీగా భక్తులను అనుమతించాలని టీటీడీ భావించింది. కానీ ఒమిక్రాన్ అలర్ట్ నేపథ్యంలో మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో నెలలో శ్రీవారికి చేసే ఉత్సావలను టీటీడీ వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  Omicron Effect on Tirumal Tirupati Devasthanam: కలియుగంల ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ (Omicron Effect)పడింది.. దీంతో టీటీడీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్.. లాక్ డౌన్ పరిస్థిల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోడం చాలామందికి కుదరలేదు.. కఠిన నిబంధనల కారణంగా గత కొన్ని నెలలలుగా తిరుమల వెలవెల బోయింది. రెండు నెలల నుంచి కరోనా కేసులు తగ్గుడంతో మళ్లీ సాధారణ పరిస్థితి వస్తుంది అనుకున్నారు. వెంకన్న స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులకు అవకాశం ఇవ్వాలని టీటీడీ భావించింది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదాశి సందర్భంగా ఎక్కువ సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ మొదట నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ఏపీని ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 16 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు టీటీడీ ప్రకటించింది. కేవలం 45 వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది..

  ఒమిక్రాన్ తో భక్తుల్లోనూ భయం నెలకొంది. ముఖ్యంగా జనవరి రెండో వారం నుంచి ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పీక్ కు చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో.. ముందుగానే స్వామి వారిని దర్శించుకుని వచ్చేయాలని భక్తులు భావిస్తున్నారు. అందుకే ఇటీవల ఆన్ లైన్ టికెట్లకు అనూహ్య డిమాండ్ లభించింది. కొన్ని సెకెన్లలో లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. వైకుంఠ ఏకాదిశి సమయంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది టీటీడీ. కచ్చితంగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా.. నెగిటివ్ రిపోర్టు తోనే స్వామి వారి దగ్గరకు రావాలని సూచించింది. జలుపు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారి దయచేసి రావొద్దు అంటూ కోరింది..

  ఇదీ చదవండి : వంగవీటి రాధా కోసం వైసీపీ-టీడీపీ ఫైట్.. చంద్రబాబుతో భేటీ.. మారుతున్న బెజవాడ రాజకీయం

  శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. నిత్యం కళ్యాణంలా ఉంటుంది స్వామి సన్నిధి. అందుకే ఆయన్ను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది.

  ఇదీ చదవండి :వరి వద్దు.. రొయ్యల సాగు ముద్దు.. తప్పుచేశానని ఒప్పుకున్న వైసీపీ సీనియర్ నేత

  టీటీడీ వెల్లడించిన వివేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి..
  జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 13వ తేదీన వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు నిర్వహిస్తారు. 14వ తేదీన వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ జరగనుంది. 15వ తేదీన మకర సంక్రాంతి.16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం జరుపుతారు. 17వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. 18న శ్రీ‌వారి ప్రణ‌య క‌ల‌హ మ‌హోత్సవం, 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు ఉత్సవం జరుదగుతుంది. 26వ తేదీన శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు ఉత్సవం ఉంటుంది. 27వ తేదీన శ్రీవారి తిరుమలనంబి ఆలయానికి వేంచెపు లాంటి విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Ttd, Ttd news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు