TIRUMALA TIRUPATI DEVASTHANAM HOTEL OWNERS READY TO PROTESTS AGAINST TTD NEW GO NGS
Tirumala: ఆందోళనలకు సిద్ధమవుతున్న హోటల్ యజమానులు.. కార్మికులు.. భవిష్యత్ కార్యచరణపై చర్చ
ఆందోళనలకు సిద్ధమవుతున్న హోటల్ యజమానులు
Tirumala Food Stalls: తిరుమలలో మరోసారి ఆందోలనలు ప్రారంభమవుతున్నాయి. టీటీడీ జీవోను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయి అందోళనకు సిద్ధమవుతున్నారు హోటల్ వ్యాపారులు, అందులో పని చేసే సిబ్బంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగింపు.. భవిష్యత్ కార్యాచరణపై వ్యాపారులు భవిష్యత్తు కార్యచరణపై చర్చలు ప్రారంభించారు.
Tirumala Tirumala Devasthanam: తిరుమల (Tirumala) లో హోటళ్లపై టీటీడీ (TTD) తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. తిరుమలపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూసివేయాలని నిర్ణయిస్తూ టీటీడీ విడుదల చేసిన జీవోలపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకాలం స్వామినే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏంటని.. హోటళ్లు మూతపడితే తామంతా రోడ్డున పడాలని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించాలని టీటీడీ నిర్ణయంపై నిరసనలు మొదలయ్యాయి. దీనిపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తిరుమలలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు (Fastfood Center) తొలగించాలన్న టీటీడీ నిర్ణయాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. తమతో ఒక్కసారి కూడా చెప్పకుండానే ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తొలగించాలని నిర్ణయించడం సమంజసం కాదని తిరుమల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మునిరెడ్డి అన్నారు.
శనివారం తిరుమలలో 130 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో మునిరెడ్డి సమావేశమయ్యారు. కొండపై ఉన్న ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగించాలని టీటీడీ పాలక మండలిలో తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. తమ సమస్యలను తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే విధంగా టీటీడీ ఛైర్మన్, ఈవోలను కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగిస్తే వచ్చే సమస్యలను వివరిస్తామన్నారు.
ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించకుండా న్యాయం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కలుస్తామన్నారు హోటల్ యజమానులు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయమన్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై భవిష్యత్తు కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. చాలాకాలం నుంచి ఇక్కడ ఇదే వ్యాపారం చేస్తూ జీవనోపాది సాగిస్తున్నామని.. సడెన్ గా షాపులు తీసేయమంటే తమ జీవనం సాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఆలోచించినప్పుడు తమను కనీసం సంప్రదించాల్సిన బాధ్యత లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఆందోళనలు ఎంత వరకు వెళ్తాయో చూడాలి..
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై ఉన్న ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తొలగించి భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని, తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.