శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శుభవార్త చెప్పింది. ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులకు మరింత సులభతరంగా గదులు పొందేలా పలు కీలక మార్పులు చేసింది. ఇందుకోసం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, అలిపిరి టోల్గేట్, శ్రీవారి మెట్టు వద్ద గదుల రిసిప్టుల స్కానింగ్ కేంద్రాలను సోమవారం ప్రారంభించింది. వీటితోపాటు సిఆర్వో జనరల్ కార్యాలయంలో ఇదివరకే ఉన్న కౌంటర్ల వద్ద కూడా గదుల రిసిప్టులను స్కాన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో గదులు ముందస్తు బుకింగ్ చేసుకున్న యాత్రికులు మొదట సిఆర్వో కార్యాలయానికి వెళ్లి రిసిప్టులు స్కాన్ చేసుకుని అక్కడినుండి సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు. దీనివల్ల సమయం వృథా అవుతోందని పలువురు యాత్రికులు అభిప్రాయపడడంతో ఈ విధానంలో టిటిడి పలు మార్పులు చేసింది. నూతన విధానంలో యాత్రికులు సిఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశారు.
తిరుపతి నుండి వచ్చే కాలినడకన వచ్చే యాత్రికుల కోసం అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు వద్ద, వాహనాల్లో వచ్చే వారి కోసం అలిపిరి టోల్గేట్ వద్ద స్కానింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. యాత్రికులు ఇక్కడ గదుల రిసిప్టును స్కాన్ చేయించుకున్న కొంత సమయంలోనే రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు సబ్ ఎంక్వైరీ కార్యాలయ వివరాలు పంపుతారు. తద్వారా యాత్రికులు నేరుగా సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి వెళ్లి గదులు పొందే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా, త్వరలో తిరుమలలో సిఆర్వో కార్యాలయాన్ని వికేంద్రీకరించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాట్మెంట్ కౌంటర్లను సబ్ ఎంక్వైరీ కార్యాలయాలకు తరలిస్తారు.
ఇది చదవండి: పుట్టినరోజు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం... మనసులో మాటపై కార్యకర్తలకు లేఖ
అలాగే ఇటీవల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెల 21 నుండి 30 వరకు తిరుమల దర్శనం కోసం ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో..., రానున్న 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ తెలిపింది. అంటే ఆ టికెట్ల మరో 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. ఏప్రిల్ నెల 21 నుండి 30 వరకు తిరుమల దర్శనం కోసం ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో... రానున్న 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ తెలిపింది. అంటే ఆ టికెట్ల మరో 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.