తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..

TTD : శ్రీవారి కల్యాణం లడ్డూను ఈ నెల 12న సామాన్య భక్తులకు సైతం అందుబాటులోకి తెచ్చిన టీటీడీ.. ‘వడ’ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధం అవుతోంది.

news18-telugu
Updated: February 20, 2020, 7:51 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..
తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వం సిద్దమైంది.
  • Share this:
తిరుమల శ్రీవారు అనగానే.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ గుర్తొస్తుంది. ఆ లడ్డూకు పేటెంట్ హక్కులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు దాని ప్రత్యేకతేంటో. ప్రపంచంలో ఎక్కడా.. ఏ లడ్డూ ఇవ్వని కమ్మని రుచిని అందిస్తుంది తిరుమల లడ్డు. అందుకే చాలామంది తిరుమలకు వెళ్లలేకపోయినా.. అక్కడి లడ్డూను రుచి చూడాలని కోరుకుంటారు. అంతటి కమ్మదనానికి మరో రుచికర ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇప్పటికే శ్రీవారి కల్యాణం లడ్డూను ఈ నెల 12న సామాన్య భక్తులకు సైతం అందుబాటులోకి తెచ్చిన టీటీడీ.. ‘వడ’ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధం అవుతోంది. భక్తులకు అవసరమైన వడలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ తెలిపారు. గురువారం నుంచి భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి వస్తుందని, నిత్యం సుమారు 10 వేల కల్యాణం లడ్డూలు, 10 వేల వడ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

కాగా, శ్రీవారి కల్యాణం లడ్డూలను సామాన్య భక్తులకు కూడా అందేలా టీటీడీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఎవరి సిఫారసులు అవసరం లేకుండా.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆ లడ్డూలను విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి వీటిని అమ్ముతోంది. రూ.200గా ధర నిర్ణయించి.. చిన్న లడ్డూతో పాటు కల్యాణం లడ్డూను అందిస్తోంది.
First published: February 20, 2020, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading