Huge Demand for TTD Tickets: కరోనా సెకెండ్ వేవ్.. లాక్ డౌన్ పరిస్థిల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోడం చాలామందికి కుదరలేదు.. కఠిన నిబంధనల కారణంగా గత రెండు నెలలు తిరుమల వెలలలాడింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల నుంచి తేరుకోవడంతో మళ్లీ భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. అందులోనూ ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ హెచ్చరికలు బయపెడుతున్నాయి. దానికి తోడు.. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. జనవరి రెండో వారానికి కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరిలో పీక్ కు కేసులు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వెంకన్నస్వామిని దర్శించుకుని వచ్చేయడం మంచిదని భక్తులు భావిస్తున్నారు. అందుకే ఊహించని స్థాయిలో డిమాండ్ కనిపిస్తోంది.
తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తున్నారో టీటీడీ వెబ్సైట్లో దర్శన టికెట్ల బుకింగ్ తీరును చూస్తే అర్థమవుతోంది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. టికెట్లు ఇలా ఓపెన్ చేశారో లేదో వెంటనే ఖాళీ అయ్యాయి. రోజుకు 10 వేల చొప్పున, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చిన టికెట్లన్నీ కేవలం 10 నిమిషాల్లోనే బుక్ కావడం గమనార్హం.
ఉదయం 9 గంటలకు భక్తులు వెబ్సైట్ ఓపెన్ చేయగా 10 నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలంటూ స్క్రీన్ పై కనిపించింది. తీరా కేవలం పది నిమిషాల్లో చూసేసరికి వారాంతాలతో పాటు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక టికెట్లన్నీ బుక్ అయ్యాయి. ఇక మళ్లీ తేదీలు మార్చుకొని బుక్ చేద్దామనుకునేలోపే వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో లేవనే సందేశం దర్శనమిచ్చింది. దీంతో టికెట్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కొందరు భక్తులు నిరాశకు గురయ్యారు. ఇంతా త్వరగా అయిపోతే టికెట్లు లభించేది ఎలా.. అని సైట్ పైనా కొందరు భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఎవరైనా టికెట్లను బ్లాక్ చేస్తున్నారా అనే అనుమానపడుతున్నారు.
మరోవైపు మంగళవారం నుంచి టీటీడీ అధికారులు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు 500 రూపాయలవి.. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు 300 రూపాయలవి అందుబాటులో ఉంచనున్నారు. ఇక జనవరి 14 నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు అంటే 500 రూపాయలవి విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి : చంద్రబాబు లెక్క తప్పిందా..? చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?
వీటితో పాటు జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్లైన్లో బ్రేక్ దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు 500 రూపాయలవి, శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల 500 రూపాయల వాటిని మంగళవారం అందుబాటులోకి తేనుంది టీటీడీ..
శ్రీవేంకటేశ్వరుడిని సర్వదర్శనం టోకెన్లను అనుకున్న షెడ్యూల్ కన్నా రెండు రోజుల తరువాత విడుదల చేసింది టీటీడీ. జనవరి నెలకు సంబంధించి టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్ లో విడుదల చేసారు. సర్వదర్శనం టోకెన్లను ఇలా విడుదల చేయడం అలా కాళీ అయిపోవడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే సర్వదర్శనం టిక్కెట్లను పొందారు భక్తులు. కరోనా ఆంక్షలు కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశ మాత్రం తప్పడం లేదు. ఓమిక్రాన్ ముప్పు పొంచి వున్న నేపథ్యంలో జనవరి మాసంలో కూడా దర్శనం కోటాను టీటీడీ పెంచలేదు. రోజుకీ 10వేల చొప్పున ఈ ఉదయం 9గంటలకు 2లక్షల 60వేల టోకెన్లను ఆన్ లైన్లో విడుదల చేయ్యగా...కేవలం 10నిమిషాల వ్యవధిలోనే టోకెన్లనింటిని భక్తులు
బుక్ చేసేసుకున్నారు భక్తులు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala tirupati devasthanam, Ttd news