Tirumala Temple: ఆ విషయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా...? అన్నీ శ్రీవారే చూసుకోవాలా..?

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల కొండపై (Tirumala Temple) శాస్త్రోక్తంగా ఏ కార్యక్రమం జరగాలన్నా ఆగమ శాస్త్ర సలహా మండలి చూసుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.

  • Share this:
    నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న క్షేత్రం తిరుమల (Tirumala Temple). సాక్ష్యాత్తు ఆ కలియుగ వైకుంఠ నాథుడు వెలసిన ఈ దివ్య క్షేత్రంలో ప్రతిదీ శాస్త్ర ప్రకారం జరుగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి...నిర్ణయాలు ఆగమ సలహా మండలి ఎప్పటికప్పుడు తీసుకుంటూ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు అర్చకులు. నిత్యం శ్రీవారికి నిర్వహించే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సాలకట్ల ఉత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం.., పెద్ద జీయర్, చిన్న జీయర్, రెసిడెంట్ ఆగమ సలహా దారుల పర్యవేక్షణలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం, రామానుజ చార్యులు నిర్దేశించిన నియమావళి అనుసారం నిర్వహిస్తుంటారు. వెయ్యేళ్ల క్రితం స్వామి వారి కైంకర్యాలు., ఉత్సవాలు నిర్వహించే విధంగా జీయర్ వ్యవస్థను రామానుజ చార్యులు నియమించారు. ఉత్సవం, కైంకర్యాలు జీయర్, రెసిడెంట్ ఆగమ సలహా దారుల సమక్షంలోనే నిర్వహిస్తూ వస్తుంటారు మిరాశీ అర్చకులు. గతంలో ఆగమ శాల దారులుగా 8 మందిని నియమించే వారు.

    తమిళనాడు, కర్ణాటక రాష్ట్రలనుంచి ఇద్దరినీ., శ్రీవారి ఆలయ అర్చకులతో కలపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి కొందరిని ఆగమ సలహా మండలిలో నియమించే వారు. ప్రస్తుతానికి ఈ సమాఖ్య 6కు కుదించారు. రెసిడెంట్ ఆగమ సలహా దారులు., ఐదుగురు ఆభ్యులు ఈ సలహా మండలిలో సభ్యులుగా ఉంటారు. సుందరవధన భట్టాచార్య రెసిడెంట్ ఆగమ సలహా దారులుగా వ్యవహరించే వారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు., శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.,ద్వారకా తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథ చార్యులు, అనంత శయన దీక్షితులు, మొహన రంగ చార్యులు ఆగమ సలహా మండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే వీరి పదవి కాలం గత ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగిసింది.

    ఇది చదవండి: రంగంలోకి దిగిన కొత్త ఎస్ఈసీ.. పరిషత్ ఎన్నికలపై కసరత్తు..



    శ్రీవారి ఆలయంలో ఏవైనా మార్పులు చేయాలన్నా, ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒక సభ్యుడు మినహా మిగిన సభ్యులకు పదవి కాలం ముగిసింది. ఇక రెసిడెంట్ ఆగమ సలహాదారులుగా ఎన్.కే సుందర వదన భట్టాచార్య పరమపదించారు. అప్పటి నుంచి రెసిడెంట్ ఆగమ సలహా దారుల నియామకం జరగలేదు. అపశృతి జరిగినా, ఎవరైనా మరణించినా, ఆలయంలో పుణ్యాహ వచనం, సంప్రోక్షమా చేయాల్సింది రెసిడెంట్ ఆగమ సలహాదారులే. శ్రీవారి ఆలయంలో రెసిడెంట్ ఆగమ సలహాదారులది చాల కీలకమైన బాధ్యత ఉంటుంది. ఇక ఆగమ సలహా మండలి అనుమతి లేనిదే ఆలయంలోను., ఉప ఆలయాల్లోనూ ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. నిత్యోత్సవాల నుంచి ఏడాదికి ఒకమారు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ఈ మండలి పాత్రే కీలకం.

    ఇది చదవండి: ప్రభుత్వం నుంచి బిల్లులు ఇలా కూడా వసూలు చేస్తారా...? కోర్టు సంచలన తీర్పు..



    ఆగమ సలహా మండలి పదవి కాలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా టీటీడీ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. శ్రీవారి కైంకర్యాలలో కీలకంగా వ్యవహరించే ఆగమ శాల మండలిలో కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. రెండో సభ్యుడిని 2019 నవంబర్ 6వ తేదీన ఆగమ సలహాదారునిగా నియమించారు. మరుసటి రోజే బాధ్యతలు స్వీకరించినా.., ప్రభుత్వం తన కోర్కెలు తీర్చలేదని ఆలయ కైంకర్యాలకు., సలహా మండలి సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రస్తుతం ఆగమ సలహా మండలిని ఒంటి భుజాలపై మోస్తున్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఆగమ సలహా మండలి పై నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: