హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

శ్రీవారి దర్శనంపై టీటీడీ క్లారిటీ.. పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా..

శ్రీవారి దర్శనంపై టీటీడీ క్లారిటీ.. పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా..

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

లాక్‌డౌన్ ముగియనుండటంతో ఎప్పుడు ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు? లాక్‌డౌన్ ఎత్తేయగానే దర్శనం కల్పిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కీలక ప్రకటన విడుదల చేశారు.

తిరుమల శ్రీవారు రోజుకు లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించేవారు. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో కేవలం అర్చకుల పూజలు మాత్రమే అందుకుంటున్నారు. అయితే, లాక్‌డౌన్ ముగియనుండటంతో ఎప్పుడు ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు? లాక్‌డౌన్ ఎత్తేయగానే దర్శనం కల్పిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనంపై క్లారిటీ ఇచ్చారు. మే 3వ తేదీ తర్వాతే దర్శనానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి భక్తులను దర్శన అనుమతిపై విధి విధానాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అటు.. మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ వాయిదా వేసింది. ఈ ఉత్సవంలో 70 మందికి పైగా సిబ్బంది సేవలు అందించాల్సి ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు లోబడి ఆగమ శాస్త్రం ప్రకారం వాయిదా వేసింది. శ్రీశార్వరి నామ సంవత్సరంలోనే వేరొక తేదీలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించవచ్చని ఆగమ సలహా మండలి సూచన చేసింది. దాంతో ఆగమ సలహా మండలి నిర్దేశించిన శుభ ముహూర్తంలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించనుంది.


First published:

Tags: AP News, Coronavirus, Covid-19, Tirumala news, Tirumala tirupati devasthanam, Ttd

ఉత్తమ కథలు