Home /News /andhra-pradesh /

TTD News: తిరుమల మరో ఘనత.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు

TTD News: తిరుమల మరో ఘనత.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల ఆలయం (ఫైల్)

TTD News: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు లభించింది. ప్రపంచంలోని ఏ ఆలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు టీటీడీకి ఈ అవార్డ్‌ లభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఈ అవార్డ్‌‌ను టీటీడీకి ఇచ్చింది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18                         Tirumala Tirupati Devasthanam:  కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala TIrupati Devasthanam) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా సేవలందిస్తున్న టీటీడీ (TTD)కి వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్ (World Book Of Record) అరుదైన రికార్డ్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కి  అందజేశారు ఆ  సంస్థ ప్రతినిధులు.
    ఉద్యోగుల కృషితోనే ఇంతటి ఘనత సాధ్యమైందన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది.

    శనివారం తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు  వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా  ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు.

    ఇదీ చదవండి : లక్క బొమ్మల గురించి మరిచిపోవాల్సిందేనా..? సమస్య ఏంటో తెలుసా..?

    క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35  వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన తెలిపారు.

    ఇదీ చదవండి : ఎన్నాళ్లీ డోలీ కష్టాలు.. రోడ్లు ఎందుకు వేయరు అంటూ ఆవేదన

    ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ , సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదంలో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని శ్రీ సుబ్బా రెడ్డి చెప్పారు.  రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి  పెద్ద పీట వేస్తోందని చెప్పారు.

    ఇదీ చదవండి : మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఇదెక్కడో కొడైకెనాలో. కులుమనాలినో కాదు.. మన దగ్గరే..

    ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్  బుక్  ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు. టీటీడీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యత పెంచిందిని.. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు  కల్పిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala brahmotsavam 2021, Ttd news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు