హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అందుకే అలా.. ‘అయోధ్య’పై టీటీడీ వివరణ

అందుకే అలా.. ‘అయోధ్య’పై టీటీడీ వివరణ

మోదీ, వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటోలు)

మోదీ, వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటోలు)

ఎస్వీబీసీలో అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమం ప్రసారం చేయకపోవడంపై టీటీడీ వివరణ ఇచ్చింది.

    అయోధ్య భూమిపూజను ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై వస్తున్న విమర్శలకు టీటీడీ స్పందించింది. తిరుమలలో ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని వివరణ ఇచ్చింది. కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని టీటీడీ తెలిపింది. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ రోజు అయోధ్య రామమందిరం శంకుస్థాపనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని టీటీడీ తెలిపింది.

    అంతకుముందు అయోధ్య రామమందిరం భూమిపూజను టీటీడీ ప్రసారం చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్‌లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. 24 గంటలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి... తక్షణం స్పందించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఈ అంశంపై టీటీడీ వివరణ ఇచ్చింది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ayodhya Ram Mandir, Svbc, Tirumala news, Ttd

    ఉత్తమ కథలు