GT Hemanth Kumar, Tirupathi, News18. Hanuma Birth Place: ఇల వైకుంఠం చుట్టూ ఆంజనేయుని (Lord Hunuma) ఆలయాలు. శ్రీవారి ఆలయంకు అభిముఖంగా శ్రీ బేడీ ఆంజనేయ స్వామి., కోనేటి రాయుని కోనేరుపై కోనేటి గట్టు ఆంజనేయుడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2కు సమీపంలో పగడాల ఆంజనేయ స్వామి, వైకుంఠం-1 వద్ద వీరాంజనేయ స్వామి, జపాలి హనుమాన్., అభయ ఆంజనేయ స్వామి అంటూ కొండంత రామబంటు ఆలయాలే దర్శనమిస్తాయి. ఇలా తిరుమల (Tirumala) మొత్తం 10 నుంచి 15 ఆంజనేయ స్వామి ఆలయాలు తిరుమలలో వెలసి ఉన్నాయి. వెరసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రంలోనే హనుమంతుడు పుట్టాడని టీటీడీ రుజువు చేస్తోంది. అందుకు కావాల్సిన శాస్త్రీయ., భౌగోళిక., శాసన ఆధారాల ద్వారా నిర్ధారించింది టీటీడీ.
పండితులు, చారిత్రక పరిశోధకులు తిరుమలే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టం చేస్తున్నారు. భగవంతుని అనుగ్రహంతో జన్మించిన ఆళ్వారులు భక్తి ప్రపత్తులను నలుదిశల వ్యాపింప చేశారు. వారు రచించిన 4 వేల పాశురాలలో 207 పాశురాలు తిరుమల క్షేత్ర వైభవాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజనేయస్వామివారి గురించి చెపుతున్నాయట. పరమ భక్తులు రచించిన భక్తి కీర్తనలలోను... అంజనాద్రి ప్రస్తావన.. భక్తి కీర్తనలలో అంజనాద్రి అనే అంశంపై ప్రసంగించారు. భగవత్ సాక్షాత్కారం కలిగిన తాళ్ళపాక అన్నమయ్య, పురందర దాసులు, వెంగమాంబ లాంటి ప్రముఖ వాగ్గేయకారులు అంజనాద్రి పర్వతం గురించి తమ కీర్తనలలో ప్రస్తావించారట.
ఇదీ చదవండి : విశాఖ ఉక్కు ఉద్యమానికి ఏడాది పూర్తి.. నిరసనలు ఉధృతం.. సంఘీభావం తెలిపిన నారాయణమూర్తి
అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్యం అనేది వివిధ పురాణాల సంకలనమని పేర్కొంటున్నారు పండితులు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో వృషభాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని వేంకటాచల మహత్యం చెపుతోంది. ఇదే అంశాన్ని పద్మ, స్కంద, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు.
త్రేతాయుగంలో తిరుమల ఆంజనేయస్వామివారి జన్మస్థలంగా ప్రసిద్ధికెక్కిందని పురాణాలూ చెప్తున్నాయి. ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవలో పఠించే శ్రీనివాస గద్యం, ఆలవట్ట కైంకర్యంలో అంజనాద్రి ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. ఋగ్వేదం నుండి వర్తమాన సాహిత్యం వరకు అన్ని పదాల్లో తిరుమల అంజనాద్రి అని నిరూపించబడుతోంది. దానికి సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి : రాత్రి 10 గంటలు.. వంటగదిలో భార్యను అలా చూసిన భర్త.. ఇదేంటని నిలదిస్తే
గోవింద రాజీయంలో తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టంగా చెప్పారు.తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందని వెంకట చాల మహత్యం చెపుతోంది. పురాణాలూ....ఇతి హాసాల్లో హనుమ జన్మస్థలం గురించి ఏమంటున్నాయి.
ఇదీ చదవండి ఓ రేంజ్ లో వైసీపీ నేతల కామెంట్లు.. కేంద్రం ఊహించని షాక్.. చంద్రబాబు రిలాక్స్ అయ్యారా..?
వేంకటాచల మహాత్యంలోని భావిశోత్తర పురాణంలో ఆంజనేయ జన్మస్థలంపై ప్రస్తావించినట్లు వేదపండితులు చెపుతున్నారు. వేంకటేశ్వరుడు కొలువైన శేషాచలంలో హనుమ వైభవం గురించి పూర్తిగా అధరాలు ఉన్నాయి. కృత యుగంలో తిరుమల కొండను వ్రుశాబాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపర యుగంలో శేసచలం అని, కలియుగంలో వేంకటాచల గా పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొనబడ్డాయి.
ఇదీ చదవండి : కూతురు కంటే ఘనంగా గోవుకి సీమంతం.. 500 మందికి దంపతులను ఆహ్వానించి ఏం చేశారంటే?
కేసరి, అంజనాదేవి అనే దంపతులలు సంతానం కలుగక పోవడంతో మాతంగి మహర్షి దగ్గరకు వెళ్లి సుపుత్రయోగం, పున్నమ నరక విముక్తికి మార్గం చెప్పాలని ప్రార్ధిస్తుంది. పంప సరోవరానికి యాభై యోజనాల దూరంలో నృసింహ ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి దక్షిణ దిశలలో నారాయణ పర్వతం ఉందని మతంగా మహర్షి చెపుతాడు. అక్కడ స్వామి పుస్కరిని ఉంది.. అక్కడ పుణ్యస్నానం ఆచరించి, అక్కడ నుంచి ఒక యోజన దూరంలో ఉన్న ఆకాశ గంగ తిర్థంలో 12 ఏళ్ళపాటు తపస్సు చేస్తే పుత్రబాగ్యం కలుగుతుందని మాతంగి మహర్షి అంజనాదేవికి సుపుత్ర బాగ్యం కలిగే మార్గం చెపుతారు.
ఇదీ చదవండి : సీఎం కేసీఆర్ కారణజన్ములు.. దేవుడే ఆయనతో ఇలా ఈ పనులు చేయిస్తున్నాడు
మాతంగి మహర్షి చెప్పిన విధంగానే వెంకటాద్రికి చేరుకున్న అంజనాదేవి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, అస్వద వృక్షాని ప్రదిక్షన్ చేసి, అక్కడ నుంచి ఒక క్రోస దూరంలో ఉన్న ఆకాశ గంగ తిర్థంలో తపస్సు ఆచరిస్తుంది అంజనాదేవి. తపస్సును మెచ్చిన వాయు దేవుడు అంజనాదేవి చేతిలో ఒక ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలం ద్వార అంజనాదేవి సుపుత్ర యోగం కలిగి, తొమ్మిది మాసాలు మోసి హనుమాన్ కు ఆ ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జాపాలిలో శ్రవణ మసంలో హరివాసంలో జన్మనిస్తుంది.
ఇదీ చదవండి : ఏపీలో రోజుకో పుష్పా సీన్.. కొత్త ఐడియాలతో సవాల్..? పోలీసులకే షాక్
చిరంజీవి హనుమ పుట్టిన స్థాలం కబట్టే వేంకటాచలనికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలూ పేర్కొంటున్నాయి.అదుకే ఆ బ్రంహ దేవుడు అంజనాదేవికి శేషాద్రి పర్వతం అంజనాద్రి అనే పేరుతో పిలువబడుతుందని వారం ఇచ్చునట్లు భావిశోత్తర పురాణంలో స్పష్టం చేయబడింది. తిరుమలలో స్వామి వారి ఆలయానికి అభిముఖంగా అంజలి గటిస్తున్న బంగిమలో బేడి ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు.
ఇదీ చదవండి : ఏపీలో మూడు రాజధానులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆయనేమన్నారంటే..?
ఆకాశ గంగలోని హనుమంతుడి జన్మస్థలానికి ఫిబ్రవరి 16న మాఘపౌర్ణమి రోజు భూమిపూజ చేయనున్నారు టీటీడీ అధికారులు. ఆకాశగంగ వద్ద భూమిపూజ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాస్త్రీయ ఆధారాలతో టీటీడీ ధర్మకర్తల మండలి సైతం ఆమోద ముద్ర వేసింది. భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటల 11 గంటల నడుమ నిర్వించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.