Home /News /andhra-pradesh /

TIRUMALA TIRUPATI DEVASTANAM NEWS 17 CRORE CAR GIFTED BY SOME DEVOTEES NGS

Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా 17 లక్షల కారు.. రెండేళ్ల తరువాత పెరిగిన రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండేళ్ల తరువాత భారీగా భక్తులు చేరుకుంటున్నారు.. అయితే తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి 17 లక్షల రూపాయల విలువ చేసే కారును విరాళంగా ఇచ్చాడు.

    Tirumala: కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) పూర్తిగా ముగియడంతో.. మళ్లీ తిరుమల (Tirumala)కు భక్తులు క్యూ కడుతున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత గతంలోలా.. భారీగా భక్తులు స్వామి సేవ కోసం తరలి వస్తున్నారు. తాజాగా శ్రీవారి ఆలయం దగ్గర 17 లక్షల విలువైన ఎంజీ కారు వచ్చి ఆగింది. ఆ కారులు ఎవరు వస్తున్నారని అంతా ఆశ్చర్యంగా చూస్తుంటే.. ఆలయ అధికారులకు ఆ కారును తిరుపతి ఎంజీ కార్స్ అధినేత ఉదయ్ కుమార్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. అలాగే ఈనెల 18న టీటీడీ (TTD)కి ఒకేరోజు రికార్డు స్థాయిలో 84 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. తిరుపతిలో చిన్న పిల్లల కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి 84 కోట్ల రూపాయలు విరాళాన్ని సమర్పించారు. కోటి రూపాయలకుపైగా విరాళం ఇచ్చిన దాతలకు ఉదయాస్తమాన సేవలు కేటాయిస్తోంది టీటీడీ. అలాగే ఈనెల 17వ తేదీన టీటీడీకి ఓ భక్తురాలు 9 కోట్ల 20 లక్షల రూపాయల విరాళం అందించారు. స్వర్గీయ డాక్టర్ ఆర్ పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి శ్రీమతి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆస్తులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మరో 42 ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కోటి రూపాయలు చొప్పున విరాళం చెల్లించి కొనుగోలు చేశారు భక్తులు. ఉదయాస్తమాన సేవలు విక్రయం ద్వారా మొత్తం 550 కోట్లు రూపాయల విరాళాలు వస్తాయని టీటీడీ అంచనా వేస్తోంది.

    కరోనా ఆంక్షల తొలగింపుతో భక్తులు తిరుమల బాట పడుతున్నారు. అందులోనూ ఆదివారం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగడంతో.. అలిపిరి చెక్‌పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం కావడంతో వాహనల సంఖ్య అంతకంతకు పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తనిఖీలు వేగవంతం చేస్తున్నారు. అంటే తిరుపతిలో దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. అలిపిరి చెక్‌పోస్టు దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. సొంత వాహనాలు, ఇతరత్రా వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి ప్రాంతం దగ్గర వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది.

    ఇదీ చదవండి : నాగబాబు కామెంట్లకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. వాయిదా వేసుకోవాల్సిందని సలహా

    ప్రస్తుతం పూర్తిగా కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. రోజుకు 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. దీంతో వెంకన్న కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి కల్యాణకట్ట, అన్నప్రసాదం ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలోనూ భక్తుల రద్దీ పెరిగింది.

    ఇదీ చదవండి : అక్కడ శివునికి పాలాభిషేకం చేస్తే.. మజ్జిగ లభిస్తుందంట..? ఆ ప్రసాదం కోసం భక్తుల క్యూ

    మరోవైపు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఇప్పటికే శుక్రవారం వీఐపీ రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో ఈ మూడు రోజులు ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించ కూడాదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.

    ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేసవి తాపం.. మండే ఎండలో వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు అవసరం

    ఇక మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300రూపాయల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను విడుదల చేశారు. అంతేకాకుండా, మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని కౌంట‌ర్లలో అందజేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news

    తదుపరి వార్తలు