CM YS Jagan: రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. రాత్రి అక్కడే బస

రేపు తిరుమలకు సీఎం జగన్

Tirumala Salakatla Brahmotsavam 2021: కలియుగ దైవం శ్రీనివాసుడు వెలిసిన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.

 • Share this:
  Tirumala Salakatla Brahmotsavam 2021: కలియుగ వైకుంఠంలో శ్రీవారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) సాగుతున్నాయి. కరోనా వైరస్ (Corona Virus) కారణంగా ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా సేవలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కల్పవృక్షంపై ఊరేగిన శ్రీవారు.. రాత్రి సర్వ భూపాల వాహనంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చారు. ఈ కలియిగానే కల్పతరువుని తానే అంటూ కల్పవృక్ష వాహనంపై., సమస్త ప్రాణకోటికి పాలించే మహారాజును తానేనంటూ సర్వ భూపాల వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. ప్రస్తుతం తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) సోమవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి మంగళగిరి (Mangalagiri)లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్.. సోమవారం నాడు అంటే తిరుమలకు వెళతారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం (Gannavaram air port) నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ (Renugunta airport)కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బర్డ్ హాస్పటిల్‌ (Birds Hospital)కు చేరుకుంటారు. అక్కడ చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అటునుంచి అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.

  సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయాని (Bedi Anjaneya swamy temple)కి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. తరువాత నడకదారిలో శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని, ఏపీ ప్రభుత్వం (AP Government) తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి దర్శనం తరువాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిథి గృహానికి చేరుకురి.. సోమవారం రాత్రి అక్కడే బస చేస్తారు.

  ఇదీ చదవండి: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ప్రభుత్వం కీలక సూచనలు.. ఆ సమయంలో ఏసీలు ఆపేయాలి..

  మరుసటి రోజు ఉదయం అంటే 12వ తేదీన ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ చానళ్ళను ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. తరువాత కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని.. అటు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనం అవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
  Published by:Nagesh Paina
  First published: