హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుమల శ్రీవారి భక్తులకు తీవ్ర నిరాశ.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్లన్నీ వారికే

తిరుమల శ్రీవారి భక్తులకు తీవ్ర నిరాశ.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్లన్నీ వారికే

ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య, హుండికి 1.92 కోట్ల రూపాయల విలువైన 30,300 విదేశీ కరెన్సీ నోట్లు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కరోనా రెండో దశ పెరిగిపోక ముందు ఏప్రిల్ 2021లో, హుండికి 37,22,809 రూపాయల విలువైన 4,779 విదేశీ కరెన్సీ వచ్చింది.

ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య, హుండికి 1.92 కోట్ల రూపాయల విలువైన 30,300 విదేశీ కరెన్సీ నోట్లు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కరోనా రెండో దశ పెరిగిపోక ముందు ఏప్రిల్ 2021లో, హుండికి 37,22,809 రూపాయల విలువైన 4,779 విదేశీ కరెన్సీ వచ్చింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు. ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.

డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని అదనపు ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి తో కలసి పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 25 ఉదయం నుంచి జనవరి 3వతేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోవిడ్ 19 నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు. కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే జూన్ 8 నుంచి ఇప్పటి దాకా ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మొదట్లో పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని అన్నారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు. ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు. సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు. దీనివల్ల తిరుపతిలో కోవిడ్ పెరుగుతుందనే భయాందోళనలు కూడా నెలకొన్నాయని ధర్మారెడ్డి చెప్పారు. పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వెబ్‌సైట్లనే నమ్మండి

తిరుమలకు సంబంధించిన సేవలు, దర్శనాల విషయంలో కొన్ని నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకురావడం.. వీటి కారణంగా భక్తులు మోసపోవడం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇలాంటి వెబ్‌సైట్లపై టీటీడీ కూడా ఇటీవల సీరియస్ అయ్యింది. వీటిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశంపై టీటీడీ మరోసారి స్పందించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ‌లు, దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం అందిస్తామని సోష‌ల్ మీడియాలో న‌కిలీ వెబ్‌సైట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఈఓ జవహర్‌రెడ్డి భ‌క్తుల‌ను కోరారు. శ్రీ‌వారి భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.inను మాత్రమే వినియోగించాలని సూచించారు.

First published:

Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

ఉత్తమ కథలు