Tirumala Temple: భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ...! ఆర్జిత సేవలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..

తిరుమలలో త్వరలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

Tirumala Tirupathi Devasthanam: ఆర్జిత సేవల్లో పాల్గొనే భాగ్యం కల్పించాలని టీటీడీకి (TTD) పెద్ద ఎత్తున్న విన్నతులు అందుతున్నాయి. 10 నెలలు కావొస్తున్నా ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై టీటీడీ నిర్ణయం తీసుకోక పోవడంతో ఒత్తిడి పెరిగింది.

  • Share this:
    అలంకార ప్రియుడు., ఉత్సవ ప్రియుడైన శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకొని స్వామి వారి దర్శన భాగ్యం క్షణకాలం లభిస్తే చాలు తమ జన్మ ధన్యమవుతోందని భావిస్తారు భక్తులు. స్వామి వారి దర్శన భాగ్యం క్షణాల పాటు కాదు. ఏకంగా కొన్ని నిమిషాల పాటు లభించాలంటే కచ్చితంగా ఆర్జిత, నిత్య సేవల్లో పాల్గొనాల్సిందే. అందుకే ఆర్జిత సేవలకు ఉన్న డిమాండ్ అంతా...ఇంతా కాదు. సామాన్యుల నుంచి మాన్యుల వరకు స్వామి వారి ఆర్జిత., నిత్య సేవలో పాల్గొంటే చాలు జన్మధన్యం అనుకుంటుంటారు. అయితే ఆర్జిత సేవలను ముందస్తుగా వక్తులు బుకింగ్ చేసుకొనే విధంగా సౌకర్యం ఉండేది. ఏళ్ళ తరబడి ఆర్జిత సేవలు ముందస్తు నమోదు కావడంతో ఈ విధానాన్ని అధికారులు రద్దు చేసారు.

    మూడు నెలల ముందు మాత్రమే ఆర్జిత సేవలను బుక్ చేసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులో ఉంచింది టీటీడీ. భక్తుల వద్ద నుంచి విపరీతమైన తాకిడి రావడంతో నిత్య సేవలకు లక్కీ డిప్ విధానం, ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా ముందస్తు చర్యలో భాగంగా గత ఏడాది మార్చి 17 నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయగా.. మార్చి 20వ తేదీన దర్శనాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్వామి వారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, నిత్యోత్సవాలతో పాటుగా కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది టీటీడీ. జూన్ 8వ తేదీ నుంచి దర్శనాలు పునఃప్రారంభించినా ఆర్జిత సేవలకు మాత్రం భక్తులను అనుమతించలేదు.

    భక్తుల కోరిక మేరకు కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు గత ఏడాది ఆగస్టులో వర్చ్యువల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. అటు తరువాత గత ఏడాది నవంబర్ మాసంలో సహస్ర దీపాలంకరణ సేవ., డోలోత్సవం., ఆర్జిత బ్రహ్మోత్సవాలను వర్చువల్ విధానంలో పునఃప్రారంభించారు. భక్తులు స్వామి వారి సేవలో పాల్గొనే దర్శన భాగ్యం కల్పించారు

    స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నా ఆర్జిత సేవల్లో పాల్గొనే భాగ్యం కల్పించాలని టీటీడీకి పెద్ద ఎత్తున్న విన్నతులు అందుతున్నాయి. 10 నెలలు కావొస్తున్నా ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై టీటీడీ నిర్ణయం తీసుకోక పోవడంతో ఒత్తిడి పెరిగింది. శ్రీవారికి నిత్యం నిర్వహించే తోమాల., అర్చన సేవలు మినహా.....ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజ., మంగళవారం నిర్వహించే అష్టదళం., బుధవారం నిర్వహించే సహస్ర కలిశాభిషేకం., గురువారం నిర్వహించే తిరుప్పవడై., ఇక రోజూ నిర్వహించే వసంతోత్సవం ప్రారంభానికి నోచుకోలేదు.

    మరోవైపు శుక్రవారం నిర్వహించే అభిషేక సేవని మాత్రం ఏకాంతంగానే నిర్వహిస్తోంది టీటీడీ. స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలంటూ భక్తుల నుంచి టీడీపీకి విజ్ఞప్తులు వస్తూ ఉండడం తిరిగి ఆర్జిత సేవలు ప్రారంభించే ఆలోచనలో టీటీడీ ఉంది. ఏప్రిల్ 14 తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సేవలను పున:ప్రారంభించడంతో పాటు.., భక్తులును అనుమతించనుంది. దినితో ఏడాది పైగానే స్వామివారి ఆర్జిత సేవలో పాల్గోనే భాగ్యం కోల్పోయిన భక్తులుకు ఇది శుభవార్తే. అయితే ఆర్జిత సేవలో పాల్గొనాలంటే కచ్చితంగా కండిషన్స్ అప్లై అంటుంది టీటీడీ. కరోనా టెస్టు లో నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు.
    Published by:Purna Chandra
    First published: