Home /News /andhra-pradesh /

TIRUMALA TIRUPAI DEVASTHANAM GIVES CLARITY ABOUT HAIR CEASED AT MIZORAM MYANMAR BOARDER AND LASHES OUT AT NEGATIVE PROPAGANDA ON TTD FULL DETAILS HERE PRN

TTD Controversy: తిరుమల కొండపై తలనీలాల పంచాయతీ.. టీటీడీ రియాక్షన్ ఇదే.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల ఆలయంలో (Tirumala Temple) నెలకొన్న తలనీలాల వివాదానికి టీటీడీ (TTD) చెక్ పెట్టింది. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  తిరుమల (Tirumala Temple) కొండపై మరో వివాదం రేగింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలు అక్రమంగా విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం-మయన్మార్ సరిహద్దుల్లో (Mizoram-Myanmar Boarder) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వెంట్రుకలు తిరుమల ఆలయానికి సంబంధించినవేని వార్తలు వచ్చాయి. స్వామివారి ఆదాయానికి టీటీడీ గండికొడుతోందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా కలకలం రేగింది. మీడియా వచ్చిన వార్తలు, జరుగుతున్న ప్రచారంపై స్పందించిన టీటీడీ దీనిపై విచారణకు ఆదేశించింది. కస్టమ్స్ మరియు అస్సాం రైఫిల్స్ నుంచి నివేదిక తెప్పించుకొని ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ప్ర‌పంచ హిందువుల రాజ‌ధాని అయిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌పై కుట్ర‌పూరిత అజెండాతో కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిజోరం - మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో క‌స్ట‌మ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ సీజ్ చేసిన త‌ల‌నీలాల‌తో ఎటువంటి సంబంధం లేకపోయినా, టిటిడిని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి కొంద‌రు వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలోను, ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలోను అవాస్త‌వాలు ప్ర‌చారం చేసి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నార‌ని చెప్పారు.

  వెంట్రుకలు సీజ్‌కు సంబంధించి క‌స్ట‌మ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు స్థానిక పోలీసుల‌కు అందించిన నివేదిక‌ను ఆయ‌న మీడియాకు విడుద‌ల చేశారు.
  టిటిడి అధికారులు కుమ్మ‌క్కై త‌ల‌నీలాల‌ను అక్ర‌మ ర‌వాణా చేసిన‌ట్టు అభూత‌క‌ల్ప‌న‌లు చేశార‌ని చెప్పారు. టిటిడికి సంబంధం లేని విష‌యాల‌పై రుజువులు లేకుండా ప్ర‌చారం చేస్తూ టిటిడి ప్ర‌తిష్ట‌ను అభాసుపాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. దీనివ‌ల్ల భ‌క్తుల విశ్వాసాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 8న మిజోరంలో సీజ్ చేసిన రూ.18,17,089/- విలువ చేసే తుక్కు త‌ల‌వెంట్రుక‌లకు సంబంధించి అధికారులు పోలీసుల‌కు ఇచ్చిన రిపోర్టులో ఎక్క‌డా టిటిడి పేరే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పైగా సీజ్ చేసిన త‌ల‌నీలాలు ప్రాసెస్ చేయ‌నివిగా అందులో పేర్కొన్న‌ట్టు తెలిపారు.

  ఇది చదవండి: బీజేపీకి షాక్ ఇవ్వ‌బోతున్న ప‌వ‌న్..? రంగంలోకి దిగిన కేంద్ర పెద్ద‌లు..?


  టిటిడిలో త‌ల‌నీలాల సేక‌ర‌ణ‌, వాటి ప్రాసెసింగ్, ఈ-వేలం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌డానికి ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ ఉంద‌ని, ఇది పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. టిటిడి నుంచి ప్రాసెస్ కాకుండా ఒక్క వెంట్రుక కూడా బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ల్యాణ‌క‌ట్ట‌, విజిలెన్స్ విభాగాల అధికారులు, సుమారు 1200 మంది క్షుర‌కులను ఇంటిదొంగ‌లుగా ఆరోపించి వారిపై బుర‌ద‌చ‌ల్లార‌ని చెప్పారు. ఈ-వేలంలో కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు అవాస్త‌వ ప్ర‌చారం చేశార‌ని, ఏప్రిల్‌లో నిర్వ‌హించే ఈ-వేలానికి ఈ ఆరోప‌ణ‌లు చేసిన మీడియా ప్ర‌తినిధులు హాజ‌రై త‌ల‌నీలాలు ఎలా విక్ర‌యిస్తారో, సిండికేట్‌కు, అక్ర‌మాల‌కు అవ‌కాశం ఉందేమో ప‌రిశీలించుకోవ‌చ్చ‌న్నారు. రూ.18 ల‌క్ష‌లు విలువచేసే తుక్కు వెంట్రుక‌ల‌ను తిరుమ‌ల నుంచి 3 వేల కిలోమీట‌ర్ల దూరంలోని మిజోరంకు ట్ర‌క్కులో ఎవ‌రైనా త‌ర‌లిస్తారా అని ప్ర‌శ్నించారు.

  ఇది చదవండి: ఆ పార్టీకి ఆయ‌నే దిక్కా..? జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ఎందుకంత ఫోకస్.?  త‌ల‌నీలాలు త‌ర‌లిస్తూ సీజ్ చేసిన ట్ర‌క్ మిజోరం రాష్ట్రానికి చెందిన‌ద‌ని, ఆ రాష్ట్రానికి చెందిన ఒక మ‌హిళ స్థానికంగా సేక‌రించిన ప్రాసెస్ చేయ‌ని త‌ల‌నీలాల‌ను ర‌వాణా చేయ‌డానికి డ్రైవ‌రుకు రూ.15 వేలు ఇచ్చిన‌ట్టు అధికారులు త‌మ రిపోర్టులో స్ప‌ష్టంగా పొందుప‌రిచార‌ని ఆయ‌న చెప్పారు. టిటిడిపై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేసిన వ్య‌క్తులు, మీడియా సంస్థ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ధ‌ర్మారెడ్డి తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Tirumala tirupati devasthanam, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు