TTD: సరికొత్త బ్రాండింగ్ కు సిద్ధమైన టీటీడీ.. ఆగస్టు 15 నుంచి మార్కెట్లోకి రావాలని నిర్ణయం

ఆగస్టు 15 నుంచి తిరుమల అగరబత్తిలు

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం పెంపొందించుకోవడంలో భాగంగా మార్కెట్లోకి రావాలని నిర్ణయించింది. స్వామి వారి పేరుతో అమ్మకాలు ప్రారంభిస్తే మంచి డిమాండ్ ఉంటుందని భావించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఆదాయం కాస్త తగ్గడంతో ఇప్పుడు ఆదాయ మార్గాలపై ఫోకస్ చేసింది. దీంతో నేరుగా మార్కెట్లోకి రావాలని నిర్ణయించింది. సాధారణంగా టీటీడీ పేరుతో మార్కెట్లోకి ఏదీ వచ్చినా మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని కొనుగోలు చేసేందుకు లక్షలాది భక్తులు ఎగబడతారు. దీంతో మార్కెటింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు సిద్ధమైంది టీటీడీ. అందుకు ఈ నెల 15 వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసింది. అందుకు సంబంధించిన ప్లాన్ అంతా ఇప్పటికే సిద్ధమైపోయింది. ఇక నేరుగా మార్కెట్లోకి రావడమే ఆలస్యం. కచ్చితంగా టీటీడీ పేరుతో వచ్చిన ఆ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందకే ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో చేయాలని నిర్ణయించారు.

    టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ముడి సరుకు ఖర్చు మాత్రమే తీసుకుని, అగర బత్తులు తయారుచేసి టీటీడీకి ఇస్తుందన్నారు. వీటికి ఎంఆర్పీ నిర్ణయించి అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    మొదటి విడతగా తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ఆగస్టు 15న అమ్మకాలు ప్రారంభించి, తరువాత ఇతర ప్రాంతాల్లో విక్రయాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచగవ్యాలతో తయారు చేయాలని నిర్ణయించిన 15 రకాల ఉత్పత్తుల గురించి ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలోనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
    Published by:Nagesh Paina
    First published: