HOME »NEWS »ANDHRA PRADESH »tirumala temple ttd released online quota seva tickets

TTD Seva Tickets: శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల

TTD Seva Tickets: శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల
తిరుమలలో శ్రీవారి ఆలయం

TTD Seva Tickets | జూన్ నెలకు సంబంధించిన కోటా కింద మొత్తం 60,666 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

  • Share this:
    జూన్ మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ ఆన్‌లైన్ టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. జూన్ నెలకు సంబంధించిన కోటా కింద మొత్తం 60,666 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాద దర్శనం 1,725 టికెట్లు విడుదలయ్యాయి.

    ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 50,700 టికెట్లు విడుదల చేశారు. ఇందులో విశేష పూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి.



    అలాగే ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు.
    Published by:Janardhan V
    First published:March 06, 2020, 11:15 IST

    टॉप स्टोरीज