తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు నిరాశే ఎదురుకానుంది. క్యూలైన్లలో మార్కింగ్, స్టిక్కర్లు అంటించే సరికి దర్శనానికి అనుమతి ఇచ్చినట్లేనని వార్తలు వచ్చాయి. కానీ, కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఏపీ సర్కారు కూడా మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న ఆలయంలో దర్శనాన్ని కూడా అప్పటి వరకు ఆపేస్తారని తెలుస్తోంది. మతానికి సంబంధించి ఏ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారమే ఏపీలోనూ ఆదేశాలు కొనసాగనున్నాయి. దీన్ని బట్టి వెంకన్న దర్శనం ఇప్పట్లో లేనట్లేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై దీనిపై ఒకటి, రెండ్రోజుల్లో అధికార ప్రకటన వెలువడనుంది.
ఇదిలా ఉండగా, దర్శనాలను కొనసాగిస్తే భక్తులు భౌతికదూరం పాటించేలా రెండ్రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్ చేయించిన విషయం తెలిసిందే. అయితే.. శ్రీవారి లడ్డు ప్రసాద విక్రయం మాత్రం గత శనివారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd