TIRUMALA TEMPLE GETTING READY FOR VASANTOTSAVAM AS TTD BOARD COMPLETES ARRANGEMENTS FULL DETAILS HERE PRN TPT
Tirumala Temple: మరో ఉత్సవానికి సిద్ధమైన తిరుమల.. రెండేళ్ల తర్వాత భక్తులకు దక్కనున్న అదృష్టం..
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) మరో ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీవారి (Tirumala Srivaru) వార్షిక వసంతోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. ప్రతి ఏటా స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) మరో ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీవారి (Tirumala Srivaru) వార్షిక వసంతోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. ప్రతి ఏటా స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. వసంత ఋతువులో జరిగే ఈ వేడుక చైత్రపూర్ణిమ రోజుకు ముగిసేలా మూడురోజుల పాటు కన్నుల పండుగగా సాగితుంది. కోవిడ్ ప్రభావంతో తిరుమలలో ఉన్న నిబంధనల కారణంగా గత రెండేళ్ళుగా వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది టిటిడి.. కోవిడ్ ప్రభావంతో ఉత్సవాలను వసంత మండపంలో కాకుండా శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో నిర్వహించారు. ఈ సారి మాత్రం బహిరంగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సాధారణంగా ఆలయం వెనుక వైపున వుండే వసంతమండపంలో నిర్వహిస్తుంటారు.
ప్రతి ఏటా చైత్రశుద్ద త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగిసేలా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను 1460లో విజయనగరరాజైన అచ్యుతరాయలు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వసంతోత్సవాలకు ముందు రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, స్వామి వారితో పాటు ప్రకృతి దేవతలకు శాంతి పూజలు నిర్వహిస్తారు. అనంతరం సంప్రోక్షణాది క్రతువులు నిర్వహించి వతంతోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఆలయ పండితులు నిర్వహిస్తారు.
వసంతోత్సవాలలో భాగంగా మొదటిరోజు ఉదయం ఉత్సవముర్తులైన శ్రీదేవి ,భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు మేళతాళాలతో ఊరేగుతూ శ్రీవారి ఆలయంకు వెనుక భాగంలో ఉన్న వసంత మండపంకు చేరుకుంటారు. అనంతరం స్వామి వారికి ఆస్ధానం, సడళ్లింపు సేవలను నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తరువాత స్వామి వారు ఉభయదేవేరులతో బయలుదేరి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం లోపల ఉన్న భాష్యకారుల ముఖ మండపంలో శ్రీవారికి ఆస్ధానంను ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో రెండవరోజు మధ్యాహ్నం వసంత మండపంలో స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న స్వామి వారికి ఆస్ధానం నిర్వహిస్తారు. ఉదయం శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సృవర్ణరధంను అధిరోహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగుతారు. వసంతోత్సవాల చివరి రోజైన మూడవరోజు మలయప్ప స్వామితో పాటు వేరు వేరు పల్లకీలలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి,సీతారామలక్ష్మణులను కూడా మంగళవాయిద్యాలతో ఆలయం నుంచి వసంత మండపంకు వేంచేపు చేస్తారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాది అభిషేకాలు నిర్వహించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది టిటిడి.. అయితే ఈ ఏడాది కోవిడ్ ప్రభావం పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో వసంతోత్సవాలను హంగులు ఆర్భాటాలతో అత్యంత వైభవంగా నిర్వహించనుంది టిటిడి.
వార్షిక వసంతోత్సవాలు జరిగే వసంత మండపాన్ని వివిధ రకాల పుష్పాలు, పండులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు టిటిడి ఉద్యానవనం అధికారులు.. వివిధ రాష్ట్రాల నుండి తెప్పించే అరుదైన పుష్పాలు, పండ్లతో వసంతోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా ఈ ఏడాది తీర్ఛిదిద్దనుంది టిటిడి.. వసంతబుతువులో జరిగే ఈ ఉత్సవానికి సుగంధ భరిత పుష్పాలు, వివిధ రకాల పండ్లను స్వామి వారికి నివేదించడమే ఈ ఉత్సవంలోని ప్రధాన ప్రక్రియ.. ఈ వార్షిక వసంతోత్సవాల సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకూ కళ్యాణోత్సవం,ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను, 15వ తేదీన నిజపాద దర్శనం సేవను టిటిడి రద్దు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.