తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా..?

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా..?

తిరుమల దేవస్థానం (File Photo)

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.4.14కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

  • Share this:
    తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.4.14కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో హుండీ ఆదాయం పెరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 76,705మంది శ్రీవారిని దర్శించుకున్నట్టు సమాచారం. సంక్రాంతి వరకు ఇదే రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక దర్శనం విషయానికొస్తే.. బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్స్‌ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు 16గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం,దివ్య దర్శనం,ప్రత్యేక దర్శనాలకు దాదాపు 3 గంటల సమయం పడుతోంది.
    Published by:Srinivas Mittapalli
    First published: