తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. భక్తిభావాన్ని పెంపొందించేలా ఏర్పాట్లు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను సోమవారం ఉదయం టిటిడి అదనపు ఈవో శ్రీఏవీ ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 30, 2019, 5:38 PM IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. భక్తిభావాన్ని పెంపొందించేలా ఏర్పాట్లు..
తిరుమల తిరుపతి దేవస్థానం
  • Share this:
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను సోమవారం ఉదయం టిటిడి అదనపు ఈవో శ్రీఏవీ ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా మహా ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. కల్యాణ వేదికలో టీటీడీ ఎస్వీ మ్యూజియం విభాగం, ప్రజాసంబంధాల విభాగం, ఉద్యానవన శాఖ, అటవీవిభాగం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మహాప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీ అత్తి వరదరాజస్వామి వారి తరహాలో మూడు భంగిమల్లో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌ను చూస్తే కంచికి వెళ్లి చూసినట్లు ఉందన్నారు. అదేవిధంగా నాలుగు యుగాలకు సంబంధించి పౌరాణిక ఘట్టాలతో భక్తిభావాన్ని పంచేలా దేవతామూర్తులను రూపకల్పన చేశామని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో దాదాపు 40 టన్నుల పుష్పాలు, 2 లక్షల కట్ ఫ్లవర్స్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. ఫల,పుష్పాలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, కలశాలు, గుర్రాలు, రథం తదితర ఆకృతులను ఆయన తిలకించారు.

ముందుగా శ్రీమహావిష్ణువు గరుడిపై వస్తున్న విధంగా రూపొందించిన సైకత శిల్పం, స్వామివారి చిత్రాలు, వాహనసేవలు, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌ను తిలకించారు. ప్రత్యేక పుస్తక ప్రదర్శన, సూక్ష్మ కళా చిత్ర ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఔషధాల ప్రదర్శన, టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన ఆసక్తిగా తిలకించారు. అంతకుముందు శ్రీవరాహస్వామి అతిథి గృహం - 1 పక్కన ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని వైద్య బృందాన్ని కోరారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 30, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading