తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ అయ్యింది. ఈ నెల 30 నుంచి అంగ రంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే.. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29 న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 20, 2019, 10:12 AM IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ అయ్యింది. ఈ నెల 30 నుంచి అంగ రంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే.. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29 న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. సెప్టెంబర్ 30న శ్రీవారికి పట్టువస్ర్తాలు సీఎం జగన్ సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 12 రకాలు, 40 టన్నుల పుష్పాలతో శ్రీవారికి అలంకరిస్తామని, బ్రహ్మోత్సవాలు నిర్వహించే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తులకే పరిమితమని సింఘాల్‌ చెప్పారు.

టీటీడీ బ్రహ్మోత్సవాలు (PIC: TTD Website)


బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు. మాడవీధుల్లో 280 సీసీ కెమెరాలు, 4వేల 200 మంది పోలీసులు, 8వేల 300 వాహనాలు పార్కింగ్ చేసేలా భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతేకాదు 37 ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...