తిరుమలలో పది అడుగుల పొడవున్న కొండ చిలువ కలకలం సృష్టించింది. భక్తుల సంచారమున్న ప్రాంతంలోనే అది దర్శనమివ్వడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. జేఈఓ కార్యాలయంకు సమీపంలోని ఎస్ఎంసి కాటేజీ వద్ద చెట్టులోని కొమ్మకు పెనవేసుకొనున్న కొండ చిలువను చూసి భక్తులు బిత్తరపోయారు. దీని గురించి అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని కొండ చిలువను చాకచక్కంగా పట్టుకున్నారు. కొండ చిలువను చూసేందుకు యాత్రికులు తరలివచ్చి...తమ ఫోన్లలో ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది.
రాత్రి పూట భక్తుల సంచారం లేని సమయంలో కొండ చిలువ సమీప ప్రాంతం నుంచి ఆ చెట్టుపైకి చేరుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్లు అధికారులు తెలిపారు.