Tirumala: శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌..నవరాత్రి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం

Tirumala Pournami Garuda Seva: తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా పౌర్ణమి రోజున నిర్వహించే గ‌రుడ‌సేవను గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య వేడుకగా నిర్వహించారు.

news18-telugu
Updated: October 1, 2020, 8:09 PM IST
Tirumala: శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌..నవరాత్రి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా పౌర్ణమి రోజున నిర్వహించే గ‌రుడ‌సేవను గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య వేడుకగా నిర్వహించారు. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా గరుడసేవను నిర్వహించారు.  టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిప్రదమైన సేవగా గరుడ సేవను పరిగణిస్తారు. తదుపరి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20న స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహించనున్నారు.

tirumala news, garuda seva, pournami garuda seva, october pornami date, tirumala temple news, tirumala navaratri brahmostavams 2020, tirumala brahmostavams, తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తిరుమల పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏ రోజున ఏయే వాహన సేవలు నిర్వహిస్తారో ఇక్కడ చూడండి.

tirumala news, garuda seva, pournami garuda seva, october pornami date, tirumala temple news, tirumala navaratri brahmostavams 2020, tirumala brahmostavams, తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తిరుమల పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్


నవరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

అటు అక్టోబర్ 16వ తేదీ నుంచి నిర్వహించనున్న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసుల స‌మ‌న్వ‌యంతో టిటిడిలోని వివిధ విభాగాలు చేప‌ట్టాల్సిన ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తాతో క‌లిసి ఈ స‌మీక్ష చేప‌ట్టారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించగా...నవరాత్రి బ్రహ్మోత్సవాలను పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

- ప‌రిమితంగా భ‌క్తుల‌తో నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహ‌న‌సేవ‌ల ఊరేగింపు ఉంటుంది. గ‌రుడ సేవ‌తో పాటు అన్ని వాహ‌న‌సేవ‌ల‌కు ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే గ్యాల‌రీల్లోకి అనుమ‌తిస్తారు.

- ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు ఉంటాయి.

- బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరో రోజైన అక్టోబ‌రు 21న సాయంత్రం పుష్ప‌క విమాన‌సేవ‌, అక్టోబ‌రు 23న స్వ‌ర్ణర‌థం ఊరేగింపు ఉంటాయి.

- అక్టోబ‌రు 24న చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

- గ్యాల‌రీల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆప‌రేటెడ్ శానిటైజ‌ర్లు ఏర్పాటు.

- భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ఏర్పాట్లు. త‌గిన‌న్ని ల‌డ్డూలు త‌యారీ.

- ప‌రిమిత సంఖ్య‌లో పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు.

- హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ప‌రిమిత సంఖ్య‌లో క‌ళాబృందాల‌తో వాహ‌న‌సేవ‌ల ముందు ప్ర‌ద‌ర్శ‌న‌లు.

- క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు.
Published by: Janardhan V
First published: October 1, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading