తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

(ప్రతీకాత్మక చిత్రం)

శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు టైంస్లాట్, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది.

  • Share this:
    తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు టైంస్లాట్, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.78కోట్ల ఆదాయం లభించింది.
    Published by:Krishna Adithya
    First published: