తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అద్భుతనమైన ఆఫర్ ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనం తరహాలోనే సామాన్య భక్తులకూ స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఐతే ఇందుకోసం రూ.10వేలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది టీటీడీ. సోమవారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు. ఈ పథకానికి రూ.10వేలు విరాళమిచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు.
ఈ విరాళాల కోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది టీటీడీ. నవంబరు తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన యాప్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక మొదటి 15 రోజులు తిరుమలలో కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లను అందిస్తారు. ఐతే భక్తులు రూ. 10వేల విరాళంతో పాటు విఐపీ బ్రేక్ దర్శనం రూ.500 టికెట్ కూడా కొనాల్సి ఉంటుంది. విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రొటోకాల్ పరిధిలోకి తెచ్చి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలను తిరుమలలో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వెచ్చిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:October 21, 2019, 22:33 IST