హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయాలు

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirumala News: సామాన్య భక్తులకు కూడా టీటీడీ శుభవార్త చెప్పింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరించాలని నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలోనూ కీలక మార్పులు చేయబోతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తిరుమల(Tirumala)లో స్లాటెడ్ సర్వదర్శనం (Slotted Sarva Darshan Tickets) టికెట్ల జారీని పునరుద్ధరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో.. ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీకి సంబంధించిన 960 స్థిర ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. వాటి విలువ రూ. 85, 705 కోట్లుగా ఉందని వెల్లడించారు.

  శ్రీవారి ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. తిరుమలలో సామన్యభక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకుంది. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసి-5 (యాత్రికుల వసతి సముదాయం) నిర్మాణం చేపట్టనున్నారు. వకూళమాత ఆలయం నుంచి జూపార్క్ వరకు రూ. 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) పేర్కొన్నారు. తిరుమలలోని గదుల్లో గీజర్‌ల ఏర్పాటుకు రూ. 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేయనున్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి రూ. 6 కోట్లు 20 లక్షల నిధులు కేటాయిస్తారు. 2.45 కోట్ల రూపాయల వ్యయంతో నందకం అతిధి గృహంలో పర్నిచర్ ఏర్పాటు చేస్తారు.నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మాణం చేపట్టనున్నారు. క్లాస్ 4 ఉద్యోగులు యూనిఫాం కోసం 2.5 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటిస్థలాల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి 300 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని.. భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

  ఇక సామాన్య భక్తులకు కూడా టీటీడీ శుభవార్త చెప్పింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరించాలని నిర్ణయించింది. పొరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేకపోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యథావిధిగా కొనసాగుతుంది. అటు వీఐపీ బ్రేక్ దర్శనాల (VIP Break Darshans) సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల తరువాతే విఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించాలని యోచిస్తోంది. బ్రహ్మోత్సావాల ముగిశాక.. ప్రయోగాత్మక పరిశీలన అనంతరం వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రకటన విడుదల చేస్తారు. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి (Tirupati)నగరానికి మార్పు చేయాలని టీటీడీ భావిస్తోంది. బ్రహ్మోత్సవాల తర్వాత.. గదులు కరెంట్ బుకింగ్ విధానాన్ని తిరుపతికి తరలిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala, Tirupati, Ttd

  ఉత్తమ కథలు