రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూల విక్రయం...

రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు.

news18-telugu
Updated: May 30, 2020, 3:25 PM IST
రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూల విక్రయం...
తిరుమల లడ్డు
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల నుంచి శ్రీవారి దర్శనాలకు నోచుకోలేకపోతున్న భక్తులకు స్వామివారి ప్రసాదమైన లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు. ఇప్పటికే తిరుమల నుంచి 60 వేల లడ్డూలను టీటీడీ హైదరాబాద్‌కు పంపించింది. లడ్డూల అమ్మకం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అంతకుముందు ఏపీలో మొదలుపెట్టిన శ్రీవారి లడ్డూ అమ్మకాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీవారి లడ్డూలను అమ్మకానికి పెట్టిన తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కేవలం మూడు గంటల్లోనే లడ్డూలన్నీ అమ్ముడపోయాయి. ఒక్కరోజే 2.4 లక్షల సబ్సిడీ లడ్డూలను అమ్మినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సబ్సిడీ లడ్డూలను ఏపీలోని 12 జిల్లా కేంద్రాల్లో విక్రయించారు. జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో వీటిని అమ్మకానికి ఉంచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రూ.50 లడ్డూను టీటీడీ సబ్సిడీ కింద భక్తులకు రూ.25కే అందజేస్తోంది.


First published: May 30, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading