హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమల వారి వాహన సేవలో కురువేరులు ఎందుకంత ప్రత్యేకం? ఈ విషయాలు మీకు తెలుసా

Tirumala: తిరుమల వారి వాహన సేవలో కురువేరులు ఎందుకంత ప్రత్యేకం? ఈ విషయాలు మీకు తెలుసా

తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు

Tirumala: బ్రహ్మోత్సవాలలో వినియోగించే అన్ని పుష్పాలు ఒక ఎత్తు అయితే... స్వామి వారి వాహన సేవలో వినియోగించే కురువేరులదే అగ్ర తాంబూలం. శ్రీవారికి నిర్వహించే వాహన సేవలలోను., ఇతర వార్షిక కార్యక్రమాలలోను కురువేరు ఉంది తీరాల్సిందే.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆనంద రూపుడు.. అనంతకోటి భక్త రక్షకుడు.. గజరాజ రక్షకుడైన...భక్త ప్రియుడైన శ్రీవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం. అందుకే శ్రీవారి (tirumala brahmotsavam 2022) గర్భాలయంలో రెండు మార్లు పూల అలంకరణ జరుగుతుంటుంది. ఆ పూల అలంకరణ సేవనే... తోమాల సేవ అంటారు. శ్రీవారికి (Tirumala Srivaru) సువాసన వెదజల్లే పుష్పలంటే ఎంతో ఇష్టం. అందుకే శ్రీవారికి నిత్యం 12 రకాల పుష్పలు., 6 రకాల పత్రాలను వినియోగిస్తారు. ఇలా రోజుకు రెండుమార్లు జరిగే తోమాలలో శ్రీవారి పాదాల వద్ద నుంచి.... శ్రీవారి కిరీటం వరకు వివిధ రకాల పుష్పలను మాలలుగా కట్టి శ్రీవారికి అలంకరిస్తారు. శ్రీవారి తోమాల సేవలో స్వయంగా బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాల నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది. ఆపాదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి.

  శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల రెండు పుష్పమాలలను "తిరువడి దండలు'' అని శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే ఎనిమిది మూరాలకు గల పూలమాలలను "శిఖామణి'' అని, శ్రీవారి భుజాలనుంది ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడుతున్నట్టు అలంకరించే పొడవాటి మాలలను "సాలగ్రామమాల'' అని, శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాలమీడకి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని "కంఠంసరి'' అని అంటారు.శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు ఒక్కటిన్నర మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖచక్రాలకు అలంకరిస్తారు. శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను "కఠారిసరం'' అంటారు. రెండు మోచేతులు కిందనుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే మూడు పుష్పమాలలను "తావళములు'' అంటారు.

  ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రకాల పుష్పలను విరివిగా వినియోగిస్తారు. అధిక సంఖ్యలో మల్లెలు, మొల్లలు, ధవళం, కనకాంబరాన్ని వినియోగిస్తారు. శ్రీవారి అలంకరణకు, నైవేద్యానికి వినియోగించే సంఖ్యను దిట్టం అని అంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దిట్టం ఆధారంగానే నివేద అలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. నిత్య దిట్టంలో అర్చావతారా మూర్తిగా వెలసిన శ్రీ శ్రీనివాసునికి మల్లె, మందారం,సంపంగి, పారిజాతం, చామంతి, జాజి, విరజాజి, కలువలు, కమలాలు కనకాంబరాలు, మొల్ల, మొగలి గులాబీలు, మరువం, ధమ్మానం మావి, మాచి, వట్టి వేరు, కురువేరులు, గన్నేరు, నంది వర్ధనలతో పాటుగా హరిత హార్ధ్ర బిల్వ తులసీ దళాలను వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 250 నుంచి 300 కేజీల వరకు శ్రీవారికి పుష్పాలను అలంకటిస్తారు. అదే బ్రహ్మోత్సవాలలో అయితే... నిత్య దిట్టంతో పాటుగా 150 కేజీలు అదనంగా పుష్పాలని వాహన సేవకు వినియోహిస్తారు. ఇందులో అరుదైన పుష్పలు., పత్రాలు, వేరులు వినియోగిస్తారు.

  Pawan Kalyan: సరస్వతీ దేవికి పవన్ ప్రత్యేక పూజలు.. అక్టోబర్ నుంచి కీలక నిర్ణయాలు ఏంటంటే..?

  బ్రహ్మోత్సవాలలో వినియోగించే అన్ని పుష్పాలు ఒక ఎత్తు అయితే... స్వామి వారి వాహన సేవలో వినియోగించే కురువేరులదే అగ్ర తాంబూలం. శ్రీవారికి నిర్వహించే వాహన సేవలలోను., ఇతర వార్షిక కార్యక్రమాలలోను కురువేరు ఉంది తీరాల్సిందే. కురులు అంటే అర్థం వెంట్రుకలు అని అర్థం. సముద్ర తీరా ప్రాంతంలో అరుదుగా దొరికే కురువేరులను దాతల సహాయంతో సేకరించి.... మాలలుగా అమర్చి... శ్రీవారికి అలంకరిస్తారు. చిన్నారులకు ద్రుష్టి తాకకుండా ఎలాగైతే వెంట్రుకుకతో తడులు తాయారు చేసి కడుతామో....చిన్ని కృష్ణుడైనా శ్రీవారికి ద్రుష్టి తగలకుండా కురువేరుని అలంకరిస్తారు అర్చకులు.

  "ప్రత్యేకించి గరుడ వాహనం రోజు గరుడ మాల బరువే 150 కేజీల పై చిలుకు ఉంటుంది. సూర్య ప్రభలో ఎర్రటి పుష్పలు., చంద్ర ప్రభలో తెల్లటి వర్ణాలు కలిగిన పువ్వులను వినియోగిస్తాం. ఇక రథోత్సవంలో స్వామి వారు దూరం నుంచి భక్తులకి కనపడేలా మాలలలు తాయారు చేస్తాం. ఇక చక్ర స్నానం రోజు ప్రత్యేక మాలలు తాయారు చేస్తాము. డ్రై ఫ్రూప్ట్స్., అరుదైన పుష్పలతో ఈ మాలల తాయారు ఉంటుంది. వీటన్నిటిని దాతలకు శ్రీవారికి విరాళంగా సమర్పిస్తారని" గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు న్యూస్18కి తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirupati, Ttd

  ఉత్తమ కథలు