TIRUAPTI RMP DOCTOR GIVING TREATMENT TO CORONA PATIENTS AND DOING SURGERIES DMHO SEIZED UNAUTHORIZED HOSPITAL IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Andhra Pradesh: ఇతడో జబర్దస్త్ డాక్టర్... ఇల్లే ఆస్పత్రి... హాలే ఆపరేషన్ థియేటర్..
కడప జిల్లాలో కరోనా చికిత్స ఇస్తున్న ఆర్ఎంపీ డాక్టర్
కరోనా కాలాన్ని గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలు క్యాష్ చేసుకుంటున్నారు. పేదలను అడ్డంగా దోచేస్తున్నారు.
కరోనా మహమ్మారి పుణ్యమా అని డాక్టర్లు రాత్రింబవళ్లు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇదే అదునుగా చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఆర్ఎంపీలు ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఏకంగా సర్జన్ అవతారమెత్తాడు. తన ఇంటినే ఆపరేషన్ థియేటర్ గా మార్చేసి ట్రీట్ మెంట్ ఇస్తున్నాడు. అంతేకాదు సొంతగా ఫార్మసీ కూడా పెట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వరదా రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. ఆర్.ఎం.పి డాక్టర్ అంటే కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి.. కానీ వరదా రెడ్డి మాత్రం స్టైల్ మార్చాడు. ఇంట్లోనే సొంత హాస్పిటల్ మరియు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కరోనా టైమ్ ను అదునుగా చేసుకొని ప్రజలకు హై డోస్ ఇంజక్షన్లు, మందులు ఇస్తూ వారి నుంచి డబ్బులు దండుకుంటున్నాడు.
గతంలో కూడా రోగులకు అధిక డోసులు కలిసిన ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కొంతమంది కిడ్నీలు పాడైనట్లు ఆరోపణలు కూడా వరదారెడ్డిపై ఉన్నాయి. ఎప్పటి నుంచో వైద్యం పేరుతో ఇష్టమొచ్చిన ట్రీట్ మెంట్ ఇస్తున్న వరదా రెడ్డి.. తాజాగా ఒకడుకు ముందుకేసి సర్జన్ గా మారిపోయాడు. స్థానికంగా చెట్లుకొట్టుకునే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కిందపడి పొట్టకింద భాగంగాలో గాయమైంది. దీంతో ఇంట్లోనే అతడికి ఏకంగా 25 కుట్లు వేశాడు. గతంలో ఇతడిపై పలువురు ఫిర్యాదు చేయగా.. ఏమాత్రం లెక్కచేయకుండా తానే వైద్యం చేసేస్తున్నాడు. అంతేకాదు ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్, బెడ్లు ఏర్పాటు చేసి ఇన్ పేషెంట్ ట్రీట్ మెంట్ కూడా ఇచ్చి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాడు.
ఐతే స్థానికులు వైద్యం కోసం సుమారు 25 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇక్కడి పేదలకు వరదా రెడ్డి వైద్యమే దిక్కు. దీనిని అలుసుగా చేసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్నాడు. జిల్లా ఉన్నతాధికారులు అటువైపు తొంగిచూసిన దాఖలాలు కూడా లేవు. ఆయన వైద్యం చేయడానికి అనుమతులు ఉన్నాయా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో డీఎంహెచ్ఓ అనిల్ కుమార్ ఆర్ఎంపీ వైద్యశాలను పరిశీలించి కంగుతిన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ స్థాయిలో చేస్తున్న వైద్యం చూసి ఆశ్చర్య పోయారు. కరోనా పాజిటివ్ రోగులకు కూడా వైద్యం చేస్తున్న ఘటన చూసి వెంటనే ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఎవరూ వైద్యం చేసినా... వైద్యశాల నడిపినా కటిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.