చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...

AP Assembly Election Results 2019 : మన తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నేతలైన చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 11:27 AM IST
చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...
వైఎస్ జగన్, చంద్రబాబు (File)
  • Share this:
లోక్ సభ ఎన్నికలతోపాటూ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా గురువారమే జరుగుతుండటంతో... ఈవీఎంలు, వీవీప్యాట్లకు మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లే కీలక నేతలకు కూడా అదనపు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో అత్యంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండూ పోటాపోటీగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో... అల్లరి మూకలు, అరాచక శక్తులు, అదృశ్య శత్రువులూ ఏదో ఒక దారుణానికి పాల్పడి... ఆ నెపాన్ని ప్రత్యర్థి పార్టీపైకి నెట్టేసేలా వ్యూహాలు రచిస్తూ ఉండొచ్చని నిఘావర్గాలు పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పడంతో... వాళ్లు అలర్టయ్యారు.

ఇదే సమయంలో తనకు సరైన భద్రత లేదన్న ఆందోళనతోనే జగన్ కొత్త ఇంట్లో ఉండకుండా... వేరే ఇంటికి వచ్చారని తెలుస్తోంది. అందుకే భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ... చంద్రబాబు, వైఎస్ జగన్ ఇళ్ల దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ, వైసీపీ తరపున ఎమ్యెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆయా పార్టీ అధినేతల ఇళ్లకు, ఆఫీసులకు ఈ రెండు మూడు రోజులూ... అనుచరులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తాము కల్పించే భద్రత అందరికీ ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు.

చంద్రబాబు, జగన్ ఇళ్లు, పార్టీ కార్యాలయాలు అన్నీ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్నాయి. ఆ ఇద్దరు నేతల ఇళ్ల దగ్గరా... ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు దగ్గరుండి మరీ చేశారు. బుధవారం రాత్రి నుంచే ఈ ఇళ్ల దగ్గర ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రెండేసి కంపెనీల బలగాలు నిరంతరం కాపలా కాస్తున్నాయి. అలాగే స్థానిక పోలీసులు కూడా 50 మంది చొప్పున సెక్యూరిటీ విషయంలో పట్టుదలతో పనిచేస్తున్నారు.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు తాడేపల్లికి దగ్గరగా ఉన్నాయి. ఆ జిల్లాల్లో గెలిచే అభ్యర్థులు తమ అధినేతలను కలిసేందుకు ఆఘమేఘాలపై తాడేపల్లికి వచ్చే ఛాన్సుంది. ఇప్పటికే తాడేపల్లిలో చంద్రబాబు, జగన్ ఇళ్లు వచ్చే, పోయే నేతలతో బిజీగా మారాయి. ఇక గురువారం గెలిచిన వాళ్లు ఒక్కసారిగా తాడేపల్లికి తరలివస్తే వాళ్లందరికీ తగిన సెక్యూరిటీ కల్పించడం అసలైన సవాల్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు... తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర ఖాళీ ప్లేస్ ఎక్కువగానే ఉన్నప్పటికీ... ప్రత్యేక పార్కింగ్‌ స్లాట్లు ఏర్పాట్లు చేశారు. తద్వారా వచ్చి, వెళ్లేవారు త్వరగా పని పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. 

ఇవి కూడా చదవండి :

వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితంనెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...

ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>