హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అమ్మో పులి.. భయంతో వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు.. రంగంలోకి అధికారులు

Andhra Pradesh: అమ్మో పులి.. భయంతో వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు.. రంగంలోకి అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి (West Godawari) ఏజెన్సీలో పులి సంచారం కలకలం రేపుతోంది. పశువులపై పులి దాడి చేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు. ఏజెన్సీ పరిధిలోని కుక్కునూరు మండలానికి సమీపంలో ఉన్న తెలంగాణ అటవీ ప్రాంతంలో ఓ ఎద్దును పులి చంపడంతో కలకలం రేగింది. తాజా పులి కుక్కనూరు మండలం ఇసుక పాడుకు చేరింది.గ్రామంలోని కంటిపల్లి నాగులు అనే గిరిజన రైతుకు చెందిన పొలంలోని పశువుల పాకపై దాడి చేసిన పులి ఎద్దును చంపింది. అంతేకాదు దానిని అరకిలోమీటరు దూరం లాక్కెళ్లింది. ఉదయాన్నే పశువుల పాకలో పశువులు లేకపోవడాన్ని గుర్తించిన రైతు.. ఆ ప్రాంతంలో గాలించాడు. పశువుల పాక చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి పంజా ముద్రలు, రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులకు సమాచారమిచ్చాడు. గ్రామానికి దూరంగా ఎద్దు కళేబరాన్ని గుర్తించి పోలీసులు, అటవీశాఖ అదికారులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలిని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఎద్దుపై దాడి చేసినట్లు నిర్ధారించారు. పాదముద్రలను సేకరించిన అధికారులు దాడి చేసింది చిరుతపులా లేక మరేదైనానా అనేది నిర్ధారిస్తామని తెలిపారు. ఘటనా స్థలం వద్ద పాదముద్రలు సేకరించి పంచనామా నిర్వహించినట్లు కుక్కునూరు ఫారెస్ట్ రేంజర్ ఏడుకొండలు తెలిపారు. ఇక నుంచి అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వారాల పాటు ఏజెన్సీలోని గ్రామల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని., ఫశువులను కూడా వదిలిపెట్టొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అడవిలో బోనులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కొన్నాళ్లుగా తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో పులులు కలకలం సష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కుక్కునూరు ఏజెన్సీలోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అడవిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు పశ్చిమగోదావరి ఏజెన్సీలో పులి సంచరించిన దాఖలాలు లేవు. పైగా ఈ అటవీ ప్రాంతంలో జంతువుల సంఖ్య కూడా తక్కువ. దీంతో ఆహారం కోసం పులి గ్రామాల్లోని పశువులపై దాడి చేస్తుందేమోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పులి అలజడి నేపథ్యంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు కూడా ఇబ్బంది కలుగుతోందంటున్నారు. పులి ఒక్కసారి మనిషి రక్తం రుచిమరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి దానిని స్వేచ్ఛగా వదిలేసి.. సురక్షితంగా బంధించే ఏర్పాట్లు చేస్తామంటున్నారు.

First published:

Tags: Tiger Attack