ఏపీలో రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ.. 

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. క‌ష్ణా, తూర్పుగోదావరి జిల్లాలోని పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు.

news18-telugu
Updated: September 18, 2020, 5:23 PM IST
ఏపీలో రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ.. 
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. క‌ష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలోని.. నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని..రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షితమై భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

ఇక, గత కొద్ది రోజులుగా అల్పపీడన ప్రభావంతో  ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక, సెప్టెంబరు 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading