హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఘనంగా ట్రాన్స్ జెండర్ల వివాహం... ఒక్కటైన మూడు జంటలు

ఘనంగా ట్రాన్స్ జెండర్ల వివాహం... ఒక్కటైన మూడు జంటలు

పెళ్లికి వచ్చిన హిజ్రాలు

పెళ్లికి వచ్చిన హిజ్రాలు

తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుకలో మూడు జంటలు ఒక్కటయ్యాయి.

    పెళ్లితో మూడు ట్రాన్జ్ జెండర్ జంటలు ఒక్కటయ్యారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి మూడవందల మంది హిజ్రాలు హాజరై నవ దంపతుల్ని ఆశీర్వదించారు. భాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..అతిథుల సందడి..ఆటపాటల మధ్య హిజ్రాల వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుకలో మూడు జంటలు ఒక్కటయ్యాయి.


    తిరుపతికి చెందిన స్వప్న-చిన్ని, సిమ్రాన్-ప్రశాంతి, జానకి-అమూల్యలు వివాహం చేసుకున్నారు. హిజ్రా పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. అన్ని వివాహాల లాగే మూడు ముళ్ళు వేసి భర్తలు, భార్యలను స్వీకరించారు. ఈ వివాహానికి రాయలసీమ జిల్లాల నుంచి 300మంది హిజ్రాలు తరలివచ్చి నవవధూవరులను ఆశీర్వదించారు. ఒకేసారి మూడు వివాహాలు జరగడంతో అత్యంత ఆనందకరంగా హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు.

    First published:

    Tags: Andhra Pradesh, Tirupati, Transgender

    ఉత్తమ కథలు