హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: స్కూల్‌లో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి.. విద్యార్థులకు గాయాలు.. నాడు-నేడు తర్వాత కూడా ఎందుకిలా?

Visakhapatnam: స్కూల్‌లో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి.. విద్యార్థులకు గాయాలు.. నాడు-నేడు తర్వాత కూడా ఎందుకిలా?

విద్యార్థికి గాయాలు

విద్యార్థికి గాయాలు

Visakhapatnam: నాడు-నేడు' కార్యక్రమం కింద.. పాఠశాలలోని రెండు భవనాలకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఇందుకోసం రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1987లో నిర్మించిన పాత భవనం సీలింగ్‌కు ప్లాస్టరింగ్ చేశారు.

  • Local18
  • Last Updated :
  • Visakhapatnam, India

ఏపీ ప్రభుత్వం 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్కూళ్ల రేపు రేఖలు మార్చేస్తున్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ.. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఇస్తున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఐతే 'నాడు-నేడు' పనులు చేపట్టిన ఓ స్కూల్‌లో శ్లాబ్ పెచ్చులు ఊడిపడడం.. చర్చనీయాంశమైంది. క్లాస్ జరుగుతున్న సమయంలో పెచ్చులు ఊడిపడడంతో.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విశాఖపట్టణం జిల్లా పద్మనాభంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభం పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో.. భవనం శ్లాబ్ పెచ్చులూడిపడింది. అవి నేరుగా విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకటో తరగతి విద్యార్థి తాలాడ వేదశ్రీ, ఆమె అన్న తాలాడ ప్రేమ్‌చంద్‌తో పాటు మరో విద్యార్థిని పసుమర్తి నిత్యశ్రీకి గాయాలయ్యాయి. వేదశ్రీ తలకు తీవ్ర గాయం కావడంతో... 108 అంబులెన్సులో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని చెప్పారు. ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పనులు నాసిరకంగా చేపట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాథమిక పాఠశాలలో.. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు 18 మంది చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక వాలంటీరు ఇక్కడ పనిచేస్తున్నారు. 'నాడు-నేడు' కార్యక్రమం కింద.. పాఠశాలలోని రెండు భవనాలకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఇందుకోసం రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1987లో నిర్మించిన పాత భవనం సీలింగ్‌కు ప్లాస్టరింగ్ చేశారు. పనులు పూర్తవడంతో.. పక్క భవనంలో కూర్చుంటున్న విద్యార్థులను.. ఇందులోకి మార్చారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనాన్ని నిర్మించినప్పుడు శ్లాబ్‌ సీలింగ్‌కు ప్లాస్టరింగ్‌ చేయకుండా... తెల్ల సున్నం వేశారని అధికారులు తెలిపారు. ఇప్పుడు దానిపైనే ప్లాస్టరింగ్‌ చేశారని.. అది సరిగా పట్టకపోవడంతో పెచ్చులు ఊడిపడ్డాయని వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు